Trending Songs: ఇప్పటి వరకు 200M+ వ్యూస్ రాబట్టిన తెలుగు పాటలివే…

Trending Songs.. సాధారణంగా కొన్ని సినిమాలలోని పాటలు ప్రేక్షకులను ఎంతలా మెప్పిస్తాయి అంటే యూట్యూబ్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టిస్తూ ఉంటాయి.. అలా 200 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్లో ట్రెండ్ క్రియేట్ చేసిన తెలుగు పాటల గురించి ఇప్పుడు చూద్దాం..

Trending Songs:200M+ views in Telugu so far..!
Trending Songs:200M+ views in Telugu so far..!

అల వైకుంటపురంలో – రాములో రాముల, బుట్ట బొమ్మ..

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురంలో ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా నటించినది.. ఈ సినిమాలో పాటలు ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే . ముఖ్యంగా రాములో రాముల పాట ఏకంగా 643 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఇందులో బుట్ట బొమ్మ సాంగ్ కూడా ఏకంగా 873 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది.

పుష్ప – ఉ అంటావా..ఉఊ అంటావా, శ్రీ వల్లీ..

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప.. మైత్రి మూవీ మేకర్ నిర్మాణ సారాధ్యంలో వచ్చిన ఈ సినిమా విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ రికార్డు సృష్టించింది…ఉ అంటావా..ఉఊ అంటావా.. పాట ఏకంగా 310 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఇదే సినిమాలోని శ్రీవల్లి పాట కూడా ఏకంగా 227 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది.

- Advertisement -

గుంటూరు కారం – కుర్చీ మడతపెట్టి..

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రీ లీల నటీనటులుగా తెరకెక్కించిన చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాట సినిమా విడుదల అవ్వకముందే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో పాట యూట్యూబ్లో 200 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఛలో – చూసి చూడంగానే నచ్చేసావే..

యంగ్ హీరో నాగశౌర్య పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం ఛలో.. ఈ సినిమా ద్వారానే రష్మిక మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఈ సినిమాలోని చూసి చూడంగానే నచ్చేసావే పాట ఏకంగా 211 మిలియన్స్ కి పైగా న్యూస్ కాబట్టి రికార్డు సృష్టించింది.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా – నీలి నీలి ఆకాశం..

ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా , అమృత అయ్యర్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం కేవలం 198 రోజుల్లోనే 200 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది.

లవ్ స్టోరీ – సారంగదరియా..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా.. నాచురల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన చిత్రం లవ్ స్టోరీ.. ఈ సినిమాలోని సారంగదరియా పాట కేవలం 85 రోజుల్లోనే 200 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు