Amani and Kasturi : కోలీవుడ్, మాలీవుడ్ లపై సీనియర్ హీరోయిన్ల షాకింగ్ కామెంట్స్… అక్కడ ఇంత దారుణంగా ఉంటుందా?

Amani and Kasturi : సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొంతమంది హీరోయిన్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక భాషకు చెందిన ఇండస్ట్రీపై మరొక హీరోయిన్ కామెంట్స్ చేయడం అనేది మాత్రం అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఏ వుడ్ నుంచైనా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంత ఈజీగా బయటపడరు నటీనటులు.

అయితే తమిళ ఇండస్ట్రీలో బయట వాళ్లకు ఎక్కువగా చోటు ఉండదు అనే కామెంట్స్ ను ఇప్పటికే విన్నాం మనం. కానీ తాజాగా సీనియర్ హీరోయిన్ ఆమని అక్కడ ఏకంగా క్యాస్టింగ్ కౌచ్ ఎదురయ్యింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక మరో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ మలయాళ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించింది. ఒకరితో ఒకరు సంబంధం లేకుండానే విడివిడిగా ఈ రెండు సినిమా ఇండస్ట్రీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆమనికి కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్…

టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ ఆమని ఎన్నో సినిమాలు చేసింది. కుటుంబ కథ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ స్వస్థలం కర్ణాటక అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావన రాగా… ఇప్పుడే కాదు ఇండస్ట్రీలో ఒకప్పటి నుంచి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేసింది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా అందుబాటులో లేదు కాబట్టి ఇలాంటి విషయాలు బయటకు రాలేదని వెల్లడించింది ఆమని.

- Advertisement -

ఆ మార్క్స్ చూపించలంటూ..

మీకేమన్నా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అని ప్రశ్నించగా, తనకు కూడా ఎన్నో క్యాస్టింగ్ అనుభవాలు ఎదురయ్యాయని, ముఖ్యంగా కోలీవుడ్లో చెప్పలేనన్ని సార్లు ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. ఓసారి ఆడిషన్ కి అని పిలిచి హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తామని చెప్పారని గుర్తు చేసుకుంది. టూ పీస్ ధరించాలని చెప్పి, అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయేమో చూపించాలని అడిగారని షాకింగ్ కామెంట్స్ చేసింది ఆమని. అయితే ఆమె డైరెక్ట్ గా కోలీవుడ్ లోనే ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురయ్యాయి అని చెప్పడం గమనార్హం.

ఇక కస్తూరి విషయానికి వస్తే…

ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు అన్నమయ్య సినిమా ద్వారా బాగా పరిచయం. అందులో నాగార్జున మరదలుగా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ బ్యూటీ కూడా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తనకు ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని గుర్తు చేసుకుంది. అయితే ఈ తమిళ భామ డైరెక్ట్ గా మలయాళ ఇండస్ట్రీని ఎక్కు పెట్టి మాట్లాడడం గమనార్హం.

బిగ్ ఆఫర్ ను లాగేసుకున్నారు..

తనకు మలయాళ ఇండస్ట్రీలో బిగ్ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చిందని, కానీ కారణం కూడా చెప్పకుండానే తనను తప్పించారని వెల్లడించింది. మొత్తానికి ఈ సీనియర్ హీరోయిన్లు ఇద్దరూ సౌత్ లోని రెండు బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీలపై వేలెత్తి చూపించడం సంచలనంగా మారింది. దీంతో కోలీవుడ్, మాలీవుడ్ లలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు