Top 10 Trending Movies on Zee5 OTT : ఈ వారం జీ5లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే… మీరు చూశారా?

Top 10 Trending Movies on Zee5 OTT : ఓటిటిలో ప్రతి వీకెండ్ ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ అన్ని సినిమాలు కూడా ట్రెండింగ్ లో ఉండవు. మంచి ప్రేక్షకాదరణను దక్కించుకున్న కొన్ని సినిమాలు నెలల తరబడి టాప్ 10 ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి. ఇందులో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే ట్రెండ్ అవుతుండడం విశేషం. మరి ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

1. కాటేరా

కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన మూవీ కాటేరా. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ జీ5 ట్రెండింగ్ లో టాప్ 10 ప్లేస్ లో ఉంది.

2 . ఓపెన్ హైమర్

ఈ ఆస్కార్ విన్నర్ హాలీవుడ్ యాక్షన్ మూవీ 2023 జూలై 21న రిలీజ్ అయినప్పటికీ ఇంకా ఓటిటిలో సందడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ట్రెండింగ్ లో 9వ స్థానంలో ఉంది.

- Advertisement -

3. గూమర్

అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా గూమర్ 8వ స్థానంలో ఉంది.

4. సామ్ బహదూర్

విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీ 7వ స్థానంలో ట్రెండ్ అవుతుంది.

5. మెయిన్ అటల్ హోం

పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జి5 ఓటిటి లో టాప్ 6లో ట్రెండ్ అవుతుంది.

6. ది కేరళ స్టోరీ

అదా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ వివాదాస్పద మూవీ చాలా గ్యాప్ తర్వాత ఓటీటీ లోకి వచ్చింది. ప్రస్తుతం జీ5 లో ఈ మూవీ టాప్ 5లో ట్రెండ్ అవుతుంది.

7. ఫారె

సల్మాన్ ఖాన్ మేనకోడలు అలిజే అగ్నిహోత్రి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఫారె. సౌమేంద్ర పది దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ 4వ స్థానంలో ట్రెండ్ అవుతుంది.

8. హనుమాన్

తేజ సజ్జ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ హనుమాన్ జనవరిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన ఈ మూవీకి ఇంకా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం హనుమాన్ మూవీ జీ5లో టాప్ 10 ట్రెండింగ్స్ లో 3వ స్థానంలో దూసుకెళ్తోంది.

9. గామి

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ హీరోగా నటించిన ప్రయోగాత్మక మూవీ గామి. విద్యాధర కాగిత అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 8న థియేటర్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 12 నుంచి జి5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం గామి టాప్ 2లో ట్రెండ్ అవుతుండడం విశేషం.

10. సైలెన్స్ 2

మనోజ్ బాజ్పాయ్ నటించిన లేటెస్ట్ మూవీ సైలెన్స్ 2 నేరుగా ఏప్రిల్ 16న జీ5 లో విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ మూవీ ట్రెండింగ్ లో ఉండగా, ప్రస్తుతం జీ5 లో టాప్ టెన్ ట్రెండింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు