Akhil: తనతో నటించిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న అఖిల్..!!

Akhil: ఈమధ్య చాలామంది యంగ్ హీరోలు, హీరోయిన్స్ వివాహం చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెబుతున్నారు.. మరి కొంతమంది ఏజ్ బార్ అవుతున్నప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే అక్కినేని ఇంట మాత్రం గత కొన్నేళ్లుగా ఎలాంటి శుభకార్యాలు జరగకపోవడంతో అభిమానులు చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాగచైతన్య – సమంత వివాహం చాలా గ్రాండ్గా జరిగినప్పటికీ ..కొన్ని కారణాల చేత వీరిద్దరూ 4 ఏళ్లకే విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో నాగచైతన్య రెండవ వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు.

Akhil: Akhil get ready to Marry his co-actor..
Akhil: Akhil get ready to Marry his co-actor..

పక్కా ప్రణాళికతో అఖిల్..

అయితే ఇప్పటివరకు అలాంటి వూసు ఎక్కడ కనిపించడం లేదు.. అదే సమయంలో అక్కినేని ఇంట మరొక హీరో అఖిల్ నిశ్చితార్థం కూడా చాలా గ్రాండ్ గా జరిగి కొన్ని కారణాల చేత వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఆ వెంటనే అఖిల్ వరుస సినిమాలతో బిజీగా అయినప్పటికీ ఆ సినిమాలు కూడా ప్లాపులను మూటకట్టుకుంటున్నాయి. చివరిగా ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసినా.. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. దీంతో తన తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతోనే అఖిల్ ముందుకు వెళ్తున్నారు.

అక్కినేని ఇంట పెళ్లి భాజాలు..

ఇలాంటి సమయంలోనే అఖిల్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.తాజాగా అందుతున్న సమాచారం మేరకు అఖిల్ వెంట ఒక హీరోయిన్ ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడుతోందనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈమె ప్రపోజ్ చేయడంతో అఖిల్ కూడా ఒప్పుకున్నారని సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఇప్పటికే అటు తన అన్న నాగచైతన్య.. మాజీ వదిన సమంతకు కూడా తెలియడంతో అఖిల్ కి సపోర్ట్ చేస్తున్నట్లుగా సమాచారం.

- Advertisement -

అఖిల్ తో నటించిన హీరోయినే..

అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న ఆ హీరోయిన్ కూడా అఖిల్ తో కలిసి ఒక చిత్రంలో నటించగా..ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ.. అందులోని పాటలు బాగానే సక్సెస్ అయ్యాయి. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అఖిల్ ని ఆ హీరోయిన్ ప్రేమించిందట. ఆ విషయాన్ని ఇటీవలే అఖిల్ తో చెప్పడంతో అఖిల్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

అఖిల్ అభిమానులలో మొదలైన ఆందోళన..

ఈ విషయం విన్న అభిమానులు అయితే కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నప్పటికీ మరి కొంతమందికి కాస్త ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా సమంతాను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడిపోయారు. ఇప్పుడు అఖిల్ కూడా అలాంటి ప్రేమ పెళ్లి చేసుకుంటూ ఉండడంతో ఫాన్స్ ఆందోళన పడుతున్నారు.ఇందులో ఇంకా నిజానిజాలు తెలియాల్సి వుంది.. ఏది ఏమైనా అన్న, వదిన చేసిన అఖిల్ చెయ్యడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి పెళ్లి గురించి ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు