Pushpa 3 Update : పుష్ప పార్ట్ 3కి భారీ గ్యాప్… బన్నీ రెండు సినిమాలు చెయ్యొచ్చు

Pushpa 3 Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి పుష్ప పార్ట్ 2 రిలీజ్ కాకముందే పార్ట్ 3 పై వార్తలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి బ్రేక్ తప్పేలా కనిపించడం లేదు. అల్లు అర్జున్ పార్ట్ 3కి ఇచ్చే గ్యాప్ సమయంలో రెండు సినిమాలను పూర్తి చేసెయ్యొచ్చు. మరి ఇంతకీ పుష్ప 3 ఎప్పుడు పట్టాలేక్కబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

గ్యాప్ రాలేదు ఇస్తున్నారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సీక్వెల్ పుష్ప 2 : ది రూల్ తో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సీక్వెల్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా పుష్ప 3కి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం మూడవ భాగానికి బ్రేక్ తప్పేలా కనిపించడం లేదు. బ్యాక్ టు బ్యాక్ కాకుండా మూడేళ్ల గ్యాప్ తర్వాత పుష్ప 3 చేయాలని అల్లు అర్జున్ తో పాటే సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే అంతలోపు బన్నీ మరో రెండు సినిమాలు పూర్తి చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

నెక్స్ట్ ఆ ఇద్దరు దర్శకులతో బన్నీ..

ఇక అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని అట్లీ లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం పుష్పా 3కి ఇచ్చే మూడేళ్ల గ్యాప్ లో ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా అట్లీ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాకే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. కాగా బన్నీ పుట్టినరోజున చేసిన స్పీకర్ పోస్ట్ తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. మొత్తానికి వరుసగా ఇద్దరు దర్శకులతో సినిమాలను పూర్తి చేయబోతున్నారు అల్లు అర్జున్.

- Advertisement -

రికార్డు ధరకు థియేట్రికల్, డిజిటల్ డీల్స్

కాగా ప్రస్తుతం పుష్ప 2 థియేట్రికల్, డిజిటల్ రైట్స్ డీల్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పుష్ప 2 : ది రూల్ ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ 275 కోట్లకు సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా అనిల్ తడాని ఈ మూవీ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను 200 కోట్లకు దక్కించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కన్పించారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయం మాత్రం తెలియరాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు