Divya Khosla: చేసింది ఐదే మూవీలు.. ప్రాపర్టీ చూస్తే షాక్..!

Divya Khosla.. దివ్య ఖోస్లా కుమార్.. తెలుగు సినీ పరిశ్రమలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కు జోడిగా 2004లో వచ్చిన లవ్ టుడే సినిమా ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత వెంటనే హిందీలో నటించే అవకాశం లభించింది. అలా “అబ్ తుమారే హవాలే వాటా సాథియో” అనే సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ… ఈ సినిమాలో ఏకంగా బాలీవుడ్ స్టార్స్ అయినా అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ అలాగే బాబీ డియోల్ సరసన ఏకంగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈమె సినిమా రంగంలో స్థిరపడాలని కోరికతో అందరిలాగా ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చింది ..అందులో భాగంగానే ఎన్నో ఆల్బమ్స్ లో కూడా నటించింది.. అయితే ఒక సినిమా మాత్రం ఈమె జీవితాన్నే మార్చేసింది..

Divya Khosla:Five movies have been made..Shock when you see the property..!
Divya Khosla:Five movies have been made..Shock when you see the property..!

పాప్ సింగర్ కూడా..

90స్ లో పాప్ సంగీతంలో తళుక్కున మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఫల్గుని పాఠక్ మ్యూజిక్ వీడియో” అయ్యో రామ “‘పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు… ఇందులో తన గ్లామర్ తో అందరిని కట్టిపడేసింది.. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సరసన “జిద్ నా కరో యే దిల్ కా” తో సహా ఎన్నో మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈమె వ్యక్తిగత జీవితానికి కొత్త మార్గాలను తెరిచిందని చెప్పవచ్చు..

సినిమా ఫ్లాప్ వల్లే వ్యక్తిగత కెరియర్ సక్సెస్..

ఈ సినిమా సెట్ లో T – సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈమెను చూసి.. ఈమె అందానికి మోహితులై మొదటిసారిగా ప్రేమలో పడ్డారు. అలా వీరు కుటుంబాలను ఒప్పించి.. 2005లో పెళ్లి చేసుకున్నారు.. ఇకపోతే ఈ జంటకి 2011లో ఒక బాబు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. 2016లో సనమ్ రే అనే చిత్రంతో మళ్ళీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ..ఆ తర్వాత దర్శక నిర్మాతగా కూడా పలు సినిమాలు చేసింది..

- Advertisement -

మధ్యతరగతి కుటుంబమే కానీ ఇప్పుడు వేల కోట్లకు అధిపతురాలు..

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దివ్య ఇప్పుడు సుమారుగా ఐదు మిలియన్లు అంటే రూ .42 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం.. హురుణ్ ఇండియా రిచ్ లిస్టు 2022లో టి – సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కుటుంబం నికర విలువ రూ.10వేల కోట్లతో 175 అత్యంత సంపన్న భారతీయుడిగా ర్యాంకు పొందారు. ఇకపోతే ఈయనను వివాహం చేసుకున్న తర్వాత ఈమె మరింత సంపన్నురాలిగా మారిపోయింది.. చేసింది ఐదు సినిమాలే కానీ భర్త కారణంగా వేలకోట్ల ఆస్తులకు అధిపతిరాలు అయింది దివ్య. ఇక ఈమె భర్త గత ఎడాది యా, ఆది పురుష్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి పాపులారిటీని దక్కించుకున్నారు.ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత దివ్య కూడా ప్రధాన పాత్రలో హీరో హీరోయిన్ అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తోంది.. ఇది తెలుగు, హిందీలో విడుదల కాదన్నట్లు సమాచారం .తెలుగు సినిమా నుంచి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి తెలుగులో పలు సినిమాలను నిర్మించాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు