Mokshagna New Look : బాలయ్యతో మోక్షజ్ఞ పిక్… న్యూ లుక్ లీక్

Mokshagna New Look : నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంట్రీకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక తాజాగా మోక్షజ్ఞ కొత్త లుక్ లీక్ అయ్యింది. అది కూడా నందమూరి కుటుంబ సభ్యులే చేయడం గమనార్హం.

తారకరత్న భార్య స్పెషల్ పోస్ట్…

దివంగత నటుడు నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య తారకరత్న సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. అందులో బాలయ్యతో పాటు ఆయన వారసుడు మోక్షజ్ఞ కూడా ఉన్నాడు. అంతేకాకుండా నందమూరి కుటుంబంలోని మరి కొంతమంది చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఆ ఫోటోలో బాలయ్య నవ్వుతూ కనిపించగా, పిల్లలతో ఆయన సంతోషంగా ఉన్నట్టుగా అన్పిస్తోంది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ను షేర్ చేసుకున్న అలేఖ్య నువ్వు ఎవరి వైపు ఉంటావు అని అడిగితే కచ్చితంగా తన కుటుంబం వైపు ఉంటానని క్లారిటీ ఇచ్చింది. దేన్నీ ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నాను అంటూ ఆ ఫోటోను షేర్ చేసింది అలేఖ్య. దీంతో ఆమె ఎలక్షన్స్ విషయంలోనే తన సపోర్ట్ టీడీపీకే అనే విషయాన్ని ఇలా బయట పెట్టింది అంటున్నారు.

మోక్షజ్ఞ న్యూ లుక్ ఇదే

ఇక ఈ ఫోటోలోనే మోక్షజ్ఞ న్యూ లుక్ కూడా లీక్ అయ్యింది. అందులో మోక్షజ్ఞ క్యాజువల్ లుక్ లో దర్శనమిచ్చాడు. బ్లాక్ కలర్ షర్ట్, యాష్ కలర్ ప్యాంట్ వేసుకుని కూల్ గా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ. దీంతో త్వరలోనే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి రెడీ అవుతున్నాడు అని ఫుల్ ఖుషి అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్. మరి ఈ నందమూరి వారసుడు ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడో కానీ అభిమానులు మాత్రం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ విషయంలో రోజుకో డైరెక్టర్ పేరు తెరపైకి వస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే…

ప్రస్తుతం బాలకృష్ణ ఇటువైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీలో జరిగే ఎలక్షన్స్ లో టిడిపి తరఫున ప్రచారం చేస్తున్నారు బాలయ్య. లాగా బాలయ్య ప్రస్తుతం డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తన 109 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఎలక్షన్ నేపథ్యంలో షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు బాలయ్య. ఈ మూవీ పూర్తయ్యాక డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేయనున్నారు బాలయ్య. ఎన్నికల తరువాత అఖండ సీక్వెల్ కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని అన్నారు బోయపాటి. అఖండ 2 సామాజిక అంశాల నేపథ్యంలో తెరకెక్కనుంది అని సమాచారం. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఈ పిక్ నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ లో ఉన్న మోక్షజ్ఞ లుక్ వైరల్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు