Samuthirakhani: ఎమోషనల్ గా ఆకట్టుకుంటున్న విమానం ట్రైలర్

విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “విమానం”. కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్, జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మీరా జాస్మిన్ నటించగా, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్, అనసూయ, మాస్టర్ ధృవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా “విమానం” సినిమా యొక్క అఫిషియల్ ట్రైలర్ విడుదల అయింది.

అనుపమ పరమేశ్వరన్ లాంచ్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. విమానం ఎక్కాలని కోరుకునే కొడుకు, ఆ కొడుకు యొక్క కోరికను ఎలాగైనా నెరవేర్చాలనుకున్న తండ్రి కథ ఇది. ఫన్, ఎమోషన్ సమపాళ్లలో ఉన్న ఈ ట్రైలర్ ని చూస్తుంటే సముద్రఖని మళ్లీ తన నటనకి మెరుగులు దిద్దినట్టు అనిపించింది. విమానం సినిమాలో ప్రత్యేక పాత్రలో మీరా జాస్మిన్ నటించిందని అందరికి తెలిసిందే. అయితే ఆ రోల్ బహుశా ఒక అరగంట మాత్రమే ఉండవచ్చని ట్రైలర్ ని చూస్తే అర్ధమైపోతుంది. ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయ మరోసారి బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది.

ఇక మిగతా ఆర్టిస్టులు వారి పరిధి మేరకు కనిపించగా, సినిమాకు అందించిన మ్యూజిక్ బాగుంది. ట్రైలర్ ని ఎమోషనల్ గా చూపించిన దర్శకుడు ఒక ఫీల్ గుడ్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడని అర్ధమైపోతుంది. హను రావూరి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక “విమానం” సినిమాను జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు