Prabhas : లైన్ క్లియర్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ సినిమా వ‌స్తుందంటే ఆ క్రేజ్ వేరు. బాహుబ‌లి సినిమా త‌రువాత ప్ర‌భాస్ రేంజ్ మొత్తం మారిపోయింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం అత‌నితో పోటీ ఎందుకు అనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా  నార్త్ ఇండియాలో ఆ విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న ప్ర‌భాస్ సినిమాలు హిట్‌, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా భారీ క‌లెక్ష‌న్లు వ‌సూలు చేయ‌డం విశేషం.

టాలీవుడ్ తో పాటు ద‌క్షిణాది ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒక‌టి ఆదిపురుష్ కాగా.. మ‌రొక‌టి స‌లార్‌. ఆదిపురుష్ ఎలాగో జ‌న‌వ‌రి 12, 2023న సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా వ‌స్తున్న విషయం తెలిసిందే. ఇక‌ మ‌రో సినిమా స‌లార్‌. ఇక ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే  చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 28, 2023న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నట్టు స్ప‌ష్టం చేశారు మూవీ మేక‌ర్స్‌.

ఇదిలా ఉండ‌గా.. మ‌రో బాలీవుడ్ స్టార్ హీరో న‌టించిన చిత్రం అదే రోజు విడుద‌ల చేయాల‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. హృతిక్ రోష‌న్ హీరోగా న‌టిస్తున్న ‘ఫైట‌ర్’ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీపికా ప‌దుకొణె హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టీన‌టులు కూడా ఈ ప్రాజెక్టులో న‌టిస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫైట‌ర్ సినిమాకి రూ.250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తే.. స‌లార్ రూ.200 కోట్ల‌తో నిర్మిస్తున్నార‌ట‌. రెండు యాక్ష‌న్ సినిమాలు ఒకేరోజు త‌ల‌ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. అనుకోకుండా సెప్టెంబ‌ర్ నుంచి జ‌న‌వ‌రి 25కి మారింది ఫైట‌ర్ సినిమా. ఫైట‌ర్ సినిమా ప‌క్క‌కి జ‌ర‌గ‌డంతో స‌లార్‌కి క‌లిసొచ్చిన‌ట్టే చెప్పాలి. నార్త్ నుంచి మంచి ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప్ర‌భాస్ స‌లార్ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు