Jailer: బెల్లిఫ్యాట్ నడుముతో ఆకర్షిస్తున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా యమా బిజీగా ఉంది. ఇప్పటివరకు యంగ్ హీరోలతో జతకట్టిన ఈ సుందరి ఇప్పుడు సీనియర్ హీరోలతోనే ఎక్కువగా నటిస్తుంది. చాలా మంది తమన్నా కు ఆఫర్లు రావడంలేదని సినిమాలు తగ్గించేసింది అనుకున్నా అదేం నిజం కాదు. తమన్నా ఇప్పుడు అరడజను సినిమాలతో బిజీ గా ఉంది. అయితే అందులో క్రేజీ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా అంటే అవి జైలర్, భోళా శంకర్ సినిమాలనే చెప్పాలి. ఇటు తెలుగులో మెగా స్టార్ చిరంజీవితో భోళా శంకర్లో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అటు తమిళ్ లో రజినీకాంత్ తో జైలర్ లోను హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక పలు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్న తమన్నా ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి డేటింగ్ చేస్తూ చెట్టాపట్టాలేసుకుని ముంబై ఫిల్మ్ నగర్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమన్నా సోషల్ మీడియా లో పెట్టిన ఫోటోషూట్ పోస్ట్లు వైరల్ గా మారాయి. వైట్ కలర్ హాఫ్ షర్ట్ తో తన నడుము అందాలను చూపిస్తూ జీన్స్ లో ఉండి యూత్ కి సెగలు పుట్టిస్తుంది తమన్నా. సీనియర్ హీరోయిన్ అయినా తనలో జోరు తగ్గలేదని డైరెక్టర్లకు ఈ విధంగా చెప్తున్నట్టుంది. చాలా రోజుల తర్వాత తమన్నా ఇలాంటి ఫోటోషూట్ లో కనిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక తమన్నా హిందీలో లస్ట్ స్టోరీస్2, బోలె చుడియాన్ లో నటిస్తుండగా, తమిళ్, మలయాళంలో చెరో సినిమా చేస్తుంది. ఇక ఇప్పటికే తమన్నా నటించిన భోళా శంకర్ 90శాతం షూట్ పూర్తవగా సాంగ్స్ షూట్ మాత్రమే బాకీ ఉంది. ఆగష్టు 11న ఆ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు