Idi Naa Love story : ఉదయ్ కిరణ్ లాగే తరుణ్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి లవర్ బాయ్స్, కోట్లాదిమంది అమ్మాయిల మనసులను దోచుకున్న క్రేజీ హీరోలు ఎవరంటే మొదట గుర్తుకు వచ్చేది ఉదయ్ కిరణ్, తరుణ్. లవ్ స్టోరీ సినిమాలు చేసి ఎంతో పాపులర్ అయ్యారు వీరిద్దరూ. అయితే కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ కాలం చెల్లించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత తరుణ్ కూడా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్.. నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో తరుణ్ కి ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ దక్కింది. ఆ తరువాత నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా వరుస సినిమాలు హిట్ కావడంతో దర్శక నిర్మాతలు ఈ యంగ్ హీరో ఇంటి ముందు క్యూ కట్టేవారు. కానీ అదే సమయంలో ఏమైందో ఏమో కానీ ఈయన నటించిన సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

దాంతో చాలా కాలంగా తరుణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆ సమయంలో ఉదయ్ కిరణ్ లాగా తరుణ్ కూడా డిప్రెషన్ కి వెళ్ళాడంటూ కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. వీటిపై తాజాగా ఆయన స్నేహితుడు రాజీవ్ కనకాల స్పందించారు. తరుణ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని.. ఇప్పుడు తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఎన్నో కథలు వింటున్నాడు కానీ ఓ మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాడని.. మంచి కథ దొరికితే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాడని తెలిపారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు