Sushant Singh Rajput : ఆత్మహత్య కాదు .. చంపేశారు

సుశాంత్ సింగ్ రాజపుత్ మరణించి రెండు సంవసరాలు అవుతునా అతని మరణంపై ఇంకా మిస్టరీ వీడలేదు. సీరియల్ నటుడిగా తన యాక్టింగ్ కెరీర్ నీ ప్రారంభించిన సుశాంత్ సినిమా స్టార్ గా మంచి స్థాయికి ఎదిగారు. ఎంతో మంది యాక్టర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. 2020 జూన్ 14న తన అపార్ట్మెంట్ లో సుశాంత్ ఉరి వేసుకొని చనిపొయారు. సుశాంత్ మరణ వార్త తన అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. అప్పటి నుంచి సుశాంత్ మరణం గురించి ఎదో ఒక వార్త వస్తూనే ఉంది. సుశాంత్ మరణించిన రెండున్నర ఏళ్ల తర్వాత ఒక కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. సుశాంత్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన కూపర్ ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ చెబుతన్నారు.

“సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు. ఆ రోజు పోస్ట్‌మార్టం కోసం కూపర్ హాస్పిటల్‌లో ఐదు మృతదేహాలు వచ్చాయి. వాటిలో ఒకటి వీఐపీది. మేము పోస్ట్‌మార్టం చేయడానికి వెళ్ళినప్పుడు అతను సుశాంత్ అని తెలిసింది. అతని శరీరంపై అనేక గుర్తులు ఉన్నాయి. అలాగే అతని మెడపై రెండు నుండి మూడు గుర్తులు ఉన్నాయని గుర్తించాము. పోస్ట్‌మార్టం రికార్డ్ చేయాల్సి ఉంది. పోస్ట్ మార్టం సమయంలో సుశాంత్ బాడీని మాత్రమే రికార్డ్ చేయాలని అధికారులు ఆదేశించారు. అందుకే మేం గాయాల ఫోటోలు కాకుండా, డెడ్ బాడీ ఫోటోలు మాత్రమే తీశాం” అని చెప్పుకొచ్చారు.

కూపర్ ఆసుపత్రి సిబ్బంది స్టేట్మెంట్ ను విన్న సుశాంత్ ఫాన్స్.. ఈ కేసు ను మరింత లోతుగా దర్యాప్తు చేయాలనీ CBIను కోరుతున్నారు ట్విట్టర్‌లో #JusticeForSSR ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆసుపత్రి సిబ్భంది ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసును ఏ మలుపు తిప్పబోతుందో వేచి చూస్తుండాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు