Surya: పట్టాలెక్కిన ప్రాజెక్ట్

తమిళంలో రెండు భారీ ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభం అయ్యాయి.
కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 కొంత గ్యాప్ తర్వాత ఈరోజు పునఃప్రారంభం అవుతోంది. ఈరోజు మరో సినిమా ప్రారంభం కానుంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ ఇది. సూర్య కెరీర్‌లో ఇది 42వ సినిమా.

రజనీకాంత్ నటించిన అన్నాతే తర్వాత శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రెండేళ్ల క్రితం తీయాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ రజనీ డేట్ దొరకడంతో శివ అన్నాతే పనిలో పడ్డాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న యాక్షన్‌ చిత్రం ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కుతుంది.

డైరెక్ట్ OTT విడుదలలుగా వచ్చిన సూరరై పోట్రు మరియు జై భీమ్ చిత్రాలు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత థియేట్రికల్‌గా విడుదలైన తునింతవన్‌ భారీ విజయం సాధించకపోయినా అపజయం మాత్రం చవిచూడలేదు.
అయితే సూర్య విక్రమ్ లో చేసిన రీసెంట్ క్యామియో మాత్రం సూర్య అభిమానులను థియేటర్లలో సంబరాలు చేసుకునేలా చేసింది. లోకేష్ కనగరాజ్ మల్టీ స్టారర్ విక్రమ్ లో సూర్య పాత్ర రోలెక్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మరో చిత్రం వెట్రిమారన్ దర్శకత్వంలో రాబోతున్న వతివాసల్. ఈ చిత్రం అదే పేరుతో సిఎస్ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు