Suriya : కంగువ సినిమా వాయిదా ! కారణం ఏంటి ?

కోలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మకంగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం కంగువ. సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్ గా వస్తోన్న ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్య టైటిల్ ఎనౌన్స్ చేసిన మూవీ యూనిట్, సినిమాని 2024 మొదటి నెలలో 10 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం చూస్తే ఈ సినిమా రిలీజ్ ఇంకాస్త వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

టాలీవుడ్ నుంచి బాహుబలి సినిమా వచ్చి ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటిదాకా ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీలలో ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేయడం, వరల్డ్ వైడ్ గా పాపులర్ అవడంతో అందరి దృష్టి ఒక్కసారిగా పీరియాడిక్ సినిమాపై పడింది. అప్పటి నుంచి మొదలు, అన్ని ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా పేరుతో భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమాలు రావడం మొదలయ్యాయి. కానీ ఏ సినిమా కూడా బాహుబలి మ్యాజిక్ క్రియేట్ చేయకపోయాయి.

లేటెస్ట్ గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ కూడా తమిళ్ లో మినహా ఏ భాషలలోను ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ రికార్డ్ ని టార్గెట్ గా పెట్టుకొని వస్తోన్నమరో కోలీవుడ్ సినిమానే కంగువ. సూర్య ఈ సినిమాలో వారియర్ గా కనిపించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ మరియు కెఇ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ్ లో కమర్షియల్ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -

అయితే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది, కానీ రిలీజ్ కి మాత్రం ఇంకా సమయం పట్టేలా ఉంది. ముందుగా సంక్రాంతి కానుకగా విడుడలకి ప్లాన్ చేసిన మూవీ యూనిట్ ప్రస్తుతం వచ్చే ఏడాది ఏప్రిల్ చివర్లో సినిమా రిలీజ్ చేయడానికి చూస్తున్నట్టు సమాచారం. విఎఫ్ఎక్స్ మరియు దాదాపు 10 భాషల్లో రిలీజ్ అవుతుండటంతో సినిమా క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని సమయం తీసుకొని సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట, తొందరలోనే అఫీషియల్ గా సినిమా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తారట. మరీ ఈ సినిమాతోనైనా కోలీవుడ్ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో, లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు