Srinivas Avasarala: తెలుగు సినిమాకు అవసరమైన అవసరాల

శ్రీనివాస్ అవసరాల నటుడిగా చాలామందికి తెలుసు, దర్శకుడిగా కొంతమందికి తెలుసు, రచయితగా అతి తక్కువమందికి తెలుసు. కేవలం రచన, దర్శకత్వం, నటన మాత్రమే కాకుండా కర్ణాటక సంగీతంలో ఒక సంవత్సరం పాటు వాయిలిన్ నేర్చుకున్నాడు.
శ్రీనివాస్ అవసరాల సినిమాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది.

ఊహల గుసగుసలాడే సినిమాలో “ఏమి సందేహం లేదు”
జ్యో అచ్యుతానంద సినిమాలో “ఒక లాలన”
పలానా అబ్బాయి పలానా అమ్మాయి సినిమాలో “కనుల చాటు మేఘమా”
ఈ పాటలతో పాటు ఆయా సినిమాల్లో పాటలన్ని వినసొంపుగా అనిపిస్తాయి. సింగర్ కిషోర్ కుమార్ కి శ్రీనివాస్ అవసరాల వీరాభిమాని.
అందుకే ఇంస్టాగ్రామ్ బయో లో “Sab Mein Kishore Kumar Dekho” అని ఉంటుంది.

బాసు భట్టాచార్య దర్శకత్వం వహించిన అనుభవ్ “Meri Jaan Mujhe Jaan Na Kaho” లాంటి ఒక పాటను తెలుగులో తీద్దామనుకున్నారు కానీ అది రిస్క్ అని అనిపించి చెయ్యలేదు. రీసెంట్ గా శ్రీనివాస్ తెరకెక్కించిన “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” సినిమాలో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో “నీలి మేఘమాలవో” అనే పాటను పాడించాడు.ఈ పాట Chaudhvin ka chand ho అని మహమ్మద్ రఫీ పాడిన పాటకు తెలుగు వెర్షన్.మదన కామరాజు అనే సినిమాలో “నీలి మేఘమాలవో నీలాల తారవో” అనే ఈ పాటను,అదే సాహిత్యంతో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ పాడారు. ఈ పాట “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” మంచి కీ రోల్ ను ప్లే చేస్తుంది.

- Advertisement -

అలానే మనం గమనిస్తే శ్రీనివాస్ అవసరాల రైటింగ్ స్టైల్ కూడా అద్భుతంగా ఉంటుంది. కేవలం రెండు మూడు వ్యాక్యాల్లో అనేకమైన ఆలోచనలను పొందుపరుస్తాడు. తనకు నచ్చిన కొన్ని గొప్ప మాటలను, పాటలను పుస్తకాలను తన సినిమాల్లో పొందుపరుస్తుంటాడు.

ఊహలు గుసగుసలాడే సినిమాలో…
వెంకటేశ్వర్లు: ఎలా ఉంది బీచ్ కి ఫస్ట్ టైం రావడం.?
ప్రభా: చాలా బాధగా ఉంది, ఇంకెప్పుడు బీచ్ కి ఫస్ట్ టైం రాలేము కదా. అంటుంది. ఈ డైలాగ్ గురించి శ్రీనివాస్ అవసరాల ప్రస్తావిస్తూ “అవతార్” సినిమా రివ్యూ చదివిన తరుణంలో అందులో ఒక మాట నచ్చి ఇలా మార్చాను అన్నట్లు స్వయంగా తానే చెప్పుకొచ్చాడు.

రీసెంట్ గా రిలీజైన “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” సినిమాలో కూడా “అనుపమ కస్తూరి” ఒక సందర్భంలో “సంజయ్” కి సారీ చెప్పడానికి వచ్చి చెప్పకుండా వెళ్తుంది. సారీ చెప్పడానికి వచ్చాను ఇంకా చెప్పక్కర్లేదు, ఫీల్ అయితే చాలు అంటుంది. ఇలా ఇలా చిన్న మాటలతో ఆలోచించేలా చేయడం శ్రీనివాస్ అవసరాల గొప్పతనం.

అలానే శ్రీనివాస్ అవసరాల సినిమాల్లో కొన్ని పుస్తకాలను చూపిస్తూ ఉంటారు. జ్యో అచ్యుతానంద సినిమాలో బుచ్చి బాబు రాసిన “చివరకు మిగిలేది” పుస్తకం కీలక పాత్రను పోషిస్తుంది. “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” సినిమాలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన “అమృతం కురిసిన రాత్రి” పుస్తకాన్ని మనం గమనించవచ్చు. తాను రాసుకున్న కథలను సెన్సిబుల్ గా చెప్పడంతో పాటు మన మూలలను, అద్భుతమైన సాహిత్యాన్ని గుర్తుచేసే శ్రీనివాస్ అవసరాల లాంటి దర్శకులు తెలుగు సినిమాకు ఎంతో అవసరం.

Thankyou Srinivas Avasarala.
Happy Birthday From Filmify.in

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు