Sreeleela : కోపం వస్తే ఇక అంతే..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా మారింది. ఆమె తాజాగా నటించిన మూవీ ధమాకా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దీనికి ముందు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD కూడా శ్రీలీలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆర్కా మీడియా వర్క్స్ ఆర్.కె ఫిలిమ్స్ అసోసియేట్స్ బ్యానర్స్ పై కే. కృష్ణమోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు అందించిన ఈ చిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాను పోయిన ఏడాది 2021 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా రవితేజ ధమాకా సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా మెరిసింది. దీనిలో ఈమె నటనకు, అందానికి, మాస్ డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో కొత్త సినిమాలకు శ్రీలీల మొదటి ఆప్షన్ లా కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని టాక్. రామ్ సినిమాలో ఈ బ్యూటీ అధికారికంగా ఫిక్స్ అయింది.

అలాగే నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు, నితిన్ తో ఓ చిత్రం మరో మూవీ చేస్తున్నట్లు బోగట్ట. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనలో ఒక అపరిచితుడు ఉన్నాడని పేర్కొంది. కొన్ని సార్లు తనకు తెలియకుండానే కోపం తనకు వచ్చేస్తుందని తెలిపింది. పెద్ద ముక్కు ఉన్నవాళ్లు కోపిష్టులని, అలా తనకు కోపం ఎక్కువ వస్తూ ఉంటుందని, ఆ సమయంలో అందరి మీద అరిచేస్తానంటోంది.

- Advertisement -

ఎక్కువ సార్లు అమ్మ మీద అరుస్తానని చెప్పుకొచ్చింది కానీ, కోపం చల్లారిన తర్వాత అమ్మను తిట్టినందుకు ఏడుస్తానని చెప్పింది శ్రీలీల. అపరిచితుడులా ప్రవర్తిస్తున్నావని అమ్మ కూడా తనను ఎప్పుడూ అంటూ ఉంటుందని ప్రస్తావించింది. అమ్మ కాబట్టి తనను భరిస్తోందని, వేరొకరు అయితే ఎప్పుడో పారిపోయేవారని కామెంట్ చేసింది శ్రీలీల.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు