Adhipurush : ప్రభాస్ ని ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ బ్యూటీ

నిన్న మొన్నటిదాకా ప్రభాస్ ని టాలీవుడ్ స్టార్ హీరో అని మాత్రమే అనేవాళ్ళు, కానీ బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత నుంచి ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియన్ హీరో అయిపోయాయడు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ పై బాలీవుడ్ మీడియా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దాదాపు బాలీవుడ్ స్టార్స్ అంత ప్రభాస్ గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ వస్తున్నారు. అయితే లేటెస్ట్ ఒక బాలీవుడ్ బ్యూటీ అయితే ఏకంగా ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేసింది.

ప్రభాస్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా, నిర్మాంతర కార్యక్రమాలు ముగించుకోని ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకోగా, సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ మూవీ టీం బిజీ గా ఉండగా, ఈ  సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో నటించిన బాలీవుడ్ నటి ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ సోనాల్ చౌహన్. బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్, డిక్టేటర్ సినిమాలతో పటు పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈమె తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలే. అయితే ఇటీవలనే ఈ బ్యూటీ ఒక ఇంటర్యూ లో పాల్గొనగా ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఎవరి అంచనాలకి అందదని, ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యాక.. బాలీవుడ్ ఆదిపురుష్ కి ముందు, ఆదిపురుష్ తరువాత అనేంతలా మాట్లాడుకుంటారని చెబుతూ, ప్రభాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో టాప్ స్టార్ అవుతాడని ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. మరీ బాలీవుడ్ భామ జోస్యం ప్రకారం నిజంగానే ఆదిపురుష్ సినిమా ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు