SatyaPrem Ki Katha: మంచి రెస్పాన్స్ దక్కించుకున్న కియారా కొత్త చిత్రం ట్రైలర్

కియారా అద్వానీ వరుస సినిమాలతో బిజీ గా ఉంది. కోటి రూపాయల పారితోషకం నుండి 5కోట్లు డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిన ఈ నటి సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొడుతుంది. తాజాగా కియారా అద్వానీ నటించిన లేటెస్ట్ సినిమా ట్రైలర్ విడుదలయి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలైన కొద్దిగంటల్లోనే 16మిల్లియన్లకు పైగా వ్యూస్ తో రచ్చ చేస్తుంది.

వివరాల్లోకి వెళ్తే హిందీలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం “సత్యప్రేమ్ కి కథ”. ఈ సినిమాను సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను “ఎన్ జి ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో సాజిద్ నదియాద్వాల నిర్మించాడు. ప్రేమ కథా చిత్రంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ మొత్తం ఫన్&ఎమోషనల్ గా ఆకట్టుకుంది. సినిమా హీరో కోణం లో సాగుతుండగా ట్రైలర్ ను నిశితంగా గమనిస్తే షారుఖ్ ఖాన్ నటించిన “రబ్ నే బనా ది జోడి” సినిమాను చిన్నపాటి మార్పులు చేసి తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వాని ‘కథా’ అనే రోల్ లో నటించగా ఆ పాత్రను సరదాగా ఉండి ఎమోషన్ వైపుకు మలుస్తారని అర్థమవుతుంది.

- Advertisement -

ఇక నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. సినిమాను సెట్టింగ్ జోలికి పోకుండా రియలిస్టిక్ గానే తెరకెక్కించారని అర్థమవుతుంది. ఇక ట్రైలర్ లోని బీజీమ్ మెప్పించే విధంగా ఉన్నా ఫ్రెష్ ట్యూన్స్ అయితే వినబడలేదు.

ఇక సత్యప్రేమ్ కి కథ సినిమాను జూన్ 29న విడుదల చేస్తున్నట్టు ట్రైలర్ లోనే చూపించారు. ఓవరాల్ ఈ సినిమాతో బాలీవుడ్ కి మరో మంచి క్లీన్ హిట్ పడే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇక కియారా అద్వానీ ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “గేమ్ చేంజర్” లోను హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు