హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. దాదాపుగా తెలుగులో స్టార్ హీరోల అందరితో కలిసి నటించింది స్నేహ. తన అందం, నటనతో కుర్రకారును బాగా అట్రాక్ట్ చేస్తుంది. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ యంగ్ హీరోయిన్లతో సరి సమానంగా అందం విషయంలో పోటీపడుతుంది స్నేహ.
కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే కోలీవుడ్ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లాడింది స్నేహ. వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ప్రస్తుతం స్నేహ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ, సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తోంది. అయితే గత కొద్ది రోజుల నుంచి స్నేహ వైవాహిక జీవితం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటి స్నేహ తన భర్త ప్రసన్నతో విభేదాల కారణంగా పిల్లలతో కలిసి దూరంగా ఉంటుంది అనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
Read More: Bigboss 7: భర్తతో కలిసి బిగ్ బాస్ కి ఉదయభాను?
భర్త ప్రసన్న నుంచి విడిపోయిందని, త్వరలో విడాకులు కూడా ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. నిత్యం భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే స్నేహ గత కొన్ని రోజుల నుంచి ఒక్కతే కనిపిస్తూ ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉన్నది అనేది తెలియాలంటే స్నేహ కానీ, ప్రసన్న కానీ నోరు విప్పక తప్పదు అంటున్నారు స్నేహ అభిమానులు. స్నేహ విడాకులు తీసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాలి.
Read More: Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. సలార్ స్టోరీ లీక్..!
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...