SIR : వీరలెవెల్లో క్లాస్ పీకిన “సార్” !

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం “సార్”. ఈ చిత్రాన్ని తమిళంలో “వాతి” పేరుతో తెరకెక్కిస్తున్నారు. భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయకగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించగా, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తారు. అయితే బుధవారం ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ధనుష్ ఓ లైబ్రరీలో కూర్చుని శ్రద్ధగా రాసుకుంటున్నట్లు కనిపించారు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి గురువారం మొదటి టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ టీజర్ లో ప్రస్తుతం విద్యా వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలను చాలా చక్కగా వివరించారు. ఇందులో ధనుష్ చెప్పే ఓ డైలాగ్ “విద్యా అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్.. పంచండి ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లాగా అమ్మకండి” ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలు పేదలను ఎలా దోచుకుంటున్నాయో ఈ టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో ధనుష్ నటించిన బాలగంగాధర్ లుక్, పాత్ర పై మరింత ఆసక్తి రేపుతుంది. అంటే ఈ లెక్కన ధనుష్ రోల్ చాలా ఇంటలిజెంట్ గా కనిపిస్తోందని చెప్పాలి. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు