Dhanush : ‘సార్’ రచనతో..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నుంచి వస్తున్న తాజా సినిమా వాతి. తెలుగులో సార్. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లురీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ద్విభాష చిత్రంగా సార్ రూపొందుతుంది. అలాగే ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్ట ర్ జీవి ప్రకాశ్ కుమార్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. సార్ సినిమా నుంచి అతి త్వరలోనే అప్డేట్ రానుందని ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశాడు. అప్టేడ్స్ లో భాగంగా సార్ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తామని, త్వరలోనే డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్ తెలిపారు. అలాగే ఈ ఫస్ట్ సింగిల్ లో స్పెషల్ ఉండబోతున్నట్టు చెప్పుకొచ్చారు.

త్వరలోనే విడుదల చేయబోయే ఫస్ట్ సింగిల్ ను హీరో ధనుష్ రచించారని అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇది లవ్ ట్రాక్ నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. దీంతో సినిమాతో పాటు ఫస్ట్ సింగిల్ పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. మరి నటనతో ఎన్నో రికార్డులు నమోదు చేసిన ధనుష్ తన పెన్ తో ఎలాంటి మ్యాజిక్ చేశాడో.. తెలియాలంటే ఈ ఫస్ట్ సింగిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు