Bro daddy: చిరంజీవి సినిమా నుంచి సిద్ధు ఔట్ ?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. “డీజే టిల్లు” సినిమాకంటే ముందే కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు సిద్దు. దీంతో రూట్ మార్చిన ఈ యంగ్ హీరోకి హైదరాబాద్ యూత్ స్టైల్ లో చేసిన డీజే టిల్లు సినిమాతో బ్రేక్ లభించింది.

ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ పేరుతో సీక్వెల్ చేస్తూ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సిద్దు జొన్నలగడ్డ. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింత గాధ వినుమా వంటి చిత్రాలలో నటించి డీజే టిల్లు సినిమాతో యూత్ కి ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో గురించి ఓ విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. సిద్దు జొన్నలగడ్డ ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి హ్యాండ్ ఇచ్చారట. బంగార్రాజు ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఓకే చేశారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి కొడుకు పాత్రలో నటించేందుకు సిద్దు జొన్నలగడ్డకు అవకాశం వచ్చిందని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది.

ఈ సినిమాలో నటించేందుకు సిద్దు ఏకంగా 4 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అంత సెట్ అయిందనుకునే లోపే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ పాత్ర చేయడానికి సిద్దు జొన్నలగడ్డ ఆసక్తి చూపించడం లేదనే న్యూస్ బయటకి వచ్చింది. దీంతో మరో యంగ్ హీరో కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అన్వేషణ ప్రారంభించారట. ఈ పాత్రలో మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ ని సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సిద్దు జొన్నలగడ్డ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు