Baby: టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన చిన్న సినిమాలు

టాలీవుడ్ లో ఇప్పుడు వరుస బెట్టి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చి పెద్ద సినిమాలు డిజాస్టర్లు అవుతుంటే అసలేమాత్రం హైప్ లేకుండా వచ్చే చిన్న సినిమాలు, మీడియం సినిమాలు మాత్రం బంపర్ కలెక్షన్లను సాధిస్తూ వస్తున్నాయి. మొన్న బలగం, నిన్న విరూపాక్ష, నేడు సామజవరగమన. ఈ సినిమాలకి విడుదలకు ముందు పెద్దగా హైప్ లేదు. కేవలం పబ్లిక్ లో వచ్చిన మౌత్ టాక్ కారణంగా ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఇక తాజాగా విడుదలైన సామజవరగమన కి, దానికి వచ్చిన మౌత్ టాక్ చాలా ప్లస్ కాగా, అందుకోసం చిత్ర యూనిట్ సాహసం చేసి తెలుగు రాష్ట్రాలలోనే పలు థియేటర్లలో రిలీజ్ కి కొన్ని రోజుల ముందే ప్రీమియర్లు వేసారు. ఈ ప్రీమియర్ల టాక్ తోనే సామజవరగమన రికార్డ్స్ సృష్టిస్తుంది. తాజాగా ఇదే ట్రెండ్ ని మరికొన్ని సినిమాలు కొనసాగిస్తున్నాయి. జులై 14 న విడుదల కాబోతున్న చిన్న సినిమా “బేబీ” కి హైదరాబాద్, వైజాగ్ లోని కొన్ని ప్రముఖ థియేటర్లలో ప్రీమియర్ షోస్ వేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

తాజాగా యూట్యూబ్ స్టార్ చైతన్య రావు హీరోగా వస్తున్న “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా కి కూడా వైజాగ్ లోని CMR, INOX లలో స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. దీని వల్ల సినిమాలకు మంచి టాక్ వస్తే ముందుగానే స్ప్రెడ్ అయ్యి మౌత్ టాక్ తో మంచి కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. కానీ అదే విధంగా బ్యాడ్ టాక్ వస్తే అంత కన్నా తొందరగా నెగిటివ్ స్ప్రెడ్ అయ్యి అసలు ఓపెనింగ్స్ కూడా రాకపోయే అవకాశం కూడా ఉంది. మరి ఈ చిత్రాలకు ప్రీమియర్లు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు