Shruti Haasan : వయసు సమస్యే కాదు

శృతిహాసన్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా వెండితెర అరంగేట్రం చేసిన శృతిహాసన్ మల్టీ టాలెంటెడ్ తో సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగిస్తుంది. మొదట్లో వరుస సినిమాలతో అలరించినా.. అవి సరిగా ఆకట్టుకోకపోవడంతో ఆ మధ్య కెరియర్ పరంగా కొంత సతమతమయింది. ఇక గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. ఇక స్టార్ హీరోల సరసన వరుసగా భారీ చిత్రాలలో నటిస్తోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ మాట్లాడుతూ.. తన కెరియర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకి నచ్చినట్లు పనిచేసుకుంటూ వెళ్లడమే ఇన్నేళ్ల తన జర్నీకి కారణం అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. తాను మొదట ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఓ స్టార్ హీరో కూతురిగా సెట్స్ లో ఎలా ప్రవర్తిస్తానో అని అందరూ అనుకునేవారని.. కానీ నేనెప్పుడూ ఒకరి అంచనాలకు తగినట్లు ఉండేదాన్ని కాదని అన్నారు. ఇండస్ట్రీలో సహనటులు అందరితో స్నేహంగా ఉంటూ వస్తున్నానని చెప్పింది.

దానివల్ల వయసుకు అతీతంగా వారి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చని అంటుంది. తనకంటే పెద్ద వయసు ఉన్న నటులతో నటించానని, అలాగే చిన్న వయసు హీరోలతో కూడా కలిసి నటించానని చెప్పింది. అసలు తన దృష్టిలో తనతో నటించే నటుడి వయసు సమస్యే కాదని చెప్పుకొచ్చింది. ఇక శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సంక్రాంతి బరిలో ఉన్న చిరంజీవి “వాల్తేరు వీరయ్య”, బాలకృష్ణ “వీరసింహారెడ్డి” చిత్రాలలో కూడా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు