Shriya Saran: సారీలో మెరిసిన అందాల తార శ్రియా !

టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, నటన, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పెద్దపెద్ద స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. శ్రియ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పైనే అవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన గ్లామర్ తో తెలుగు ఆడియన్స్ ను అలరిస్తూ మెప్పిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు చేసిన హవా అంతా ఇంతా కాదు.

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో శ్రియ హవా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అప్పట్లో ఈ అమ్మడుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రమక్రమంగా యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రావడంతో ఈ అమ్మడికి అవకాశాలు కాస్తా తగ్గిపోయాయి. అవకాశాలు తగ్గిపోయినప్పటికీ ఈ అమ్మడు ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడలేదు. అప్పటికి ఇప్పటికీ అదే అందం, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వస్తోంది.

Shriya Saran shows off her fav Saree

ఇదిలా ఉండగా… శ్రియ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు 2018లో ఆండ్రి కొచ్చివ్ నీ వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లయింది. ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ అదే సోయగంతో ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రియ శరన్ కు 41 ఏళ్లు ఉన్నప్పటికీ ప్రతిరోజు జిమ్ కు వెలుతోందట. ముఖ్యంగా కార్డియో వ్యాయామం చేస్తుంది. శ్రియ తల్లి యోగ ఇన్ స్ట్రక్టర్. ఇక ఇంకేముంది ఈ ముద్దుగుమ్మకు కూడా యోగా గురించి బాగా తెలుసు అన్నమాట. అందుకే ఇంత వయసు వచ్చినప్పటికీ ఏమాత్రం అందం, ఫిట్నెస్ అస్సలు తగ్గడం లేదు.

- Advertisement -

ఈ బ్యూటీ ఎంత బిజీ లైఫ్ కొనసాగిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీయ గోల్డ్ కలర్ శారీలో మెరిసింది. ఫుల్ వర్క్ బ్లౌజ్ వేసుకొని చీరలో చాలా సాంప్రదాయంగా కనిపించి అభిమానులకు కనువిందు చేసింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు తెగ లైక్స్ కొడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు