Devara Release Date : రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్ పడే అవకాశం, సెప్టెంబర్ సక్సెస్ రేట్ బాగుంది

Devara: మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు కొరటాల శివ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బీభత్సమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా నాలుగు హిట్ సినిమాలు చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఆచార్య సినిమాతో మొదటిసారి డిజాస్టర్ ని చూశాడు. ఆ సినిమా తర్వాత చాలా లోతుకి వెళ్లిపోయాడు కొరటాల శివ. కొంతకాలం పాటు బయట కూడా కనిపించలేదు. ప్రస్తుతం కొరటాల దేవర అనే పాన్ ఇండియా సినిమా ను చేస్తున్నాడు. ఈ సినిమాను రీసెంట్ గా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. టెంపర్ సినిమా తర్వాత వరుసగా సక్సెస్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఎన్టీఆర్. డిజాస్టర్ డైరెక్టర్ తో చేయి కలిపినా కూడా మంచి హిట్ సినిమాలను పొందుకుంటున్నాడు. ఇకపోతే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న బాబి తో సినిమా చేసి జై లవకుశ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అక్కడితో బాబీ కూడా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఎన్టీఆర్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసి బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ చేసిన సినిమా అది. ఆ సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయింది.

సెప్టెంబర్ నెల కలిసొస్తుంది

ఇకపోతే నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ కు, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో అద్భుతమైన హిట్ సినిమాను అందుకున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ ని హీరోగా నిలబెట్టింది ఈ సినిమా కూడా సెప్టెంబర్ లోని విడుదల అయింది. ఇక మొదటిసారి కొరటాల శివతో పని చేసిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. సినిమా కూడా సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అయింది. ఇలా గమనిస్తే సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

- Advertisement -

Janatha Garage

రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశం

ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మామూలుగా ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదలకు ప్రకటించారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తుండడం పై చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఈ నెలలో సక్సెస్ రేట్ కూడా బానే ఉంది. అన్ని వర్కౌట్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా హిట్ అవ్వడం. కొరటాల శివ మంచి కం బ్యాక్ ఇవ్వడం. రాజమౌళి సెంటిమెంట్ కూడా బ్రేక్ అవ్వడం జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు