Kalki 2898 AD: ఆ హీరో చేసిన మోసం.. ఇప్పటికీ ఒంటరిగానే.. కల్కి బ్యూటీ జీవితంలో విషాదం..!

Kalki 2898AD.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు ఇందులో నటించిన నటీనటుల పాత విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ , గ్లింప్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.. ఇందులో అనూహ్యంగా శోభన కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.. దాదాపు 18 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు మళ్లీ కల్కిలో కనిపించేసరికి. ఈమెకు సంబంధించిన పాత విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి..

సకలకళా వల్లభురాలు..

1982లో వచ్చిన భక్త ధ్రువ మార్కండేయ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శోభన.. నాగార్జున హీరోగా నటించిన విక్రమ్ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.. ఆ తర్వాత రుద్రవీణ, త్రిమూర్తులు, ఏప్రిల్ ఒకటి విడుదల, అభినందన, నిప్పురవ్వ, రౌడీ అల్లుడు ఇలా తెలుగులో చాలా సినిమాలు చేసి బంపర్ హిట్ విజయాలను అందుకుంది. వన్నెతరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె గొప్ప నాట్య కారిణి కూడా. మొత్తం ఆరు భాషల్లో దాదాపు 230కి పైగా సినిమాలలో నటించిన శోభన.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా ఇలా అన్ని విభాగాలలో కూడా నటించి సకల కళ వల్లభురాలిగా పేరు దక్కించుకుంది.

ఆ హీరో మోసం చేయడంతో పెళ్లికి దూరం..

Kalki 2898 AD: Cheated by that hero.. Still alone.. Tragedy in the life of Kalki beauty..!
Kalki 2898 AD: Cheated by that hero.. Still alone.. Tragedy in the life of Kalki beauty..!

ప్రస్తుతం ఈమె వయసు 54 సంవత్సరాలు.. ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. అయితే ఈమె పెళ్లి చేసుకోకపోవడం వెనుక పెద్ద కారణము ఉందని తెలుస్తోంది. అదేమిటంటే శోభన ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో.. ఒక హీరోని ఎంతో ఇష్టపడినట్టు.. పెళ్లి చేసుకుంటే అతడినే వివాహం చేసుకోవాలని అనుకుందట. అయితే ఇదే విషయాన్ని ఆ హీరోకి చెప్పితే ఆయన నో చెప్పాడట. దాంతో ప్రేమ, పెళ్లి అనే వాటి పైన అసహ్యం కలిగి ఇన్ని సంవత్సరాలు వివాహానికి దూరమైందట శోభన. ఒకరు కాకపోతే ఇంకొకరు అనే ఆప్షన్ పెట్టుకుంటున్న ఈ కాలంలో ప్రేమించిన వాడు వద్దనడంతో మరో పెళ్లి చేసుకోకుండా అప్పటినుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది అంటే అది మామూలు విషయం కాదు అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

18 యేళ్ళ తర్వాత రీ ఎంట్రీ..

చివరిగా తెలుగులో మోహన్ బాబు, శోభన, మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన గేమ్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈమె. మళ్లీ 18 ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. జీవితంలో ఇంతటి విషాదాన్ని నింపుకున్న ఈమె ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమాతో ఎలాంటి క్రేజ్ దక్కించుకుంటుందో చూడాలి. ఇకపోతే తమిళ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం కెమెరా ముందుకు వచ్చింది.. పెళ్లి అనే పదానికి దూరంగా ఉంటూ ఒంటరి అయిన శోభన కనీసం ఇప్పటికైనా తోడును వెతుక్కుంటుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు