Telugu Heroines : తెలుగు హీరోయిన్స్ ఇంత మంది ఉన్నారా…? మరి లోపం ఎక్కడా…?

Telugu Heroines : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉంటేనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా నిలబడటం అనేది సాధ్యమవుతుంది. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కొరత ఎక్కువగా ఉంది అని అంటుంటారు. కానీ తెలుగులో కూడా చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు.

Sreeleela

శ్రీ లీల

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. అయితే ఈ సినిమా హిట్ అవ్వకపోయినా కూడా ప్రస్తుతం తెలుగు హీరోయిన్స్ లో మంచి పొజిషన్ లో ఉంది. ఇకపోతే శ్రీలీలా సొంత ప్లేస్ ఒంగోలు. బెంగళూరులో సెటిల్ అవ్వడం వలన ముందుగా కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

Aditi Rao Hydari

అదితి రావు హైదరి

మణిరత్నం దర్శకత్వం వహించిన చెలియా సినిమాలో కనిపించి ప్రేక్షకులు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది అదితి రావు. ఇక తెలుగులో చేసిన మహాసముద్రం సినిమా చేసిన కూడా ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు.

Vaishnavi Chaitanya

వైష్ణవి చైతన్య

ఇకపోతే రీసెంట్ గా బేబీ సినిమాతో హిట్టు అందుకుంది వైష్ణవి చైతన్య. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి ఆ తరువాత బేబీ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి, బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్టు అందుకుంది. ప్రస్తుతం ఈవిడ చేతిలో మంచి ప్రాజెక్ట్ లు ఉన్నాయి .

Priyanka Jawalkar

ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా సినిమాతో మంచి గుర్తింపు సాధించుకుంది ప్రియాంక. ఆ తర్వాత ప్రియాంకకు సరైన అవకాశాలు రాలేదు. ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమాలో కూడా కనిపించి మంచి మార్కులు సాధించుకుంది. టిల్లు స్క్వేర్ సినిమాలో కనిపించింది కానీ ఆ పాత్రకి అంత ప్రాముఖ్యత లేదు.

Actress Chandini Chowdary New Stills @ Sammathame Trailer Launch

చాందిని చౌదరి

చాందిని చౌదరి స్వస్థలం వైజాగ్. ముందుగా ఫణింద్ర నర్సేట్టి దర్శకత్వం వహించిన మను అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకొని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేసింది చాందిని.

Ritu Varma

రీతు వర్మ

రీతు వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ను సాధించుకుంది. పెళ్లిచూపులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె కెరియర్ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతుంది.

isha rebba

ఇషా రెబ్బ

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకు ముందు తరువాత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈషా కెరియర్ లో కూడా ఊహించినటువంటి పెద్ద సినిమాలేవి రాలేదు. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో చేసింది. కానీ పూజ హెగ్డే చెల్లెలుగా కనిపించింది.

అయితే తెలుగులో ఎంతమంది టాలెంటెడ్ హీరోయిన్స్ ఉన్నా కూడా మన వాళ్లంతా పక్క రాష్ట్రాల్లో హీరోయిన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు