Kalki 2898 AD : బుజ్జి తయారీ ఒప్పందం ఇలా… పాత రోజులను గుర్తు చేసుకున్న ఆనంద్ మహేంద్ర

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బీభత్సమైన విజన్ ఉన్న దర్శకులలో నాగ్ అశ్విన్ ఒకరు. మహానటి సినిమాతో అద్భుతమైన హిట్టు అందుకున్న తర్వాత ఆయన కల్కి అనే సినిమాను మొదలు పెట్టాడు. అయితే కల్కి సినిమాకి సంబంధించి ప్రతి వస్తువుని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా ఈ సినిమాలో బుజ్జి అనే ఒక వెహికల్ ఉంది. ఈ వెహికల్ కి సంబంధించి మహేంద్ర గ్రూప్ తో కాంటాక్ట్ అయ్యారు. ఒక కొత్త వెహికల్ ని ఈ సినిమా కోసం సెట్ చేసారు. అయితే మహేంద్ర గ్రూప్ సపోర్ట్ తో ఆటోమొబైల్ ఇంజనీర్స్ తో ఈ వెహికల్ ని క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు.

సినిమా కోసం ఎంతోమంది ఎన్నో పనులు చేస్తుంటారు. సినిమా కోసం ప్రొఫెషనల్ టైఅప్ అయ్యి దీని క్రియేట్ చేయటం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారబోతుంది. ఈ బుజ్జి అనే వెహికల్ ను రీసెంట్ గా రివీల్ చేశారు. అయితే దీని వెనుక జరిగిన సరదా సంభాషణ ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ వేదిక షేర్ చేశారు.

- Advertisement -

ఆనంద్ గోపాల్ మహీంద్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఇండియన్ బిలియనీర్ బిజినెస్ మేన్. మహీంద్రా గ్రూప్ భారతదేశంలోని టాప్ 10 పారిశ్రామిక సంస్థలలో ఒకటైన సంస్థ కు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్. మామూలుగా వీళ్ళు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అప్పుడెప్పుడో నాగ్ అశ్విన్ సినిమా కోసం అడిగినందుకు రియాక్ట్ అవుతూ, ఇప్పుడు మళ్ళీ బుజ్జి అనే వెహికల్ ని రివీల్ చేసిన టైంలో ట్విట్టర్ వేదిక కల్కి సినిమా గురించి షేర్ చేశారు . నాగి విషయంలో చాలా గర్వంగా అవుతున్నాం, లెట్స్ గేమ్ బిగెన్ అంటూ ట్వీట్ చేసారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు