Aranmanai 4 : భయపెట్టి కోట్లు రాబట్టిన తమన్నా, రాశి… కోలీవుడ్ లో ఈ ఏడాది ఆ రికార్డును కొట్టిన మూవీ ఇదే

Aranmanai 4 : కోలీవుడ్ చిత్రసీమకు గతేడాది గోల్డెన్ టైమ్ నడిచింది. 2023 మొదట్లోనే అంటే జనవరిలో విజయ్ నటించిన వరిసు, అజిత్ నటించిన తునివు అనే రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వరిసు రూ. 300 కోట్లు, తునివు రూ.200 కోట్లు, ఓవరాల్ గా జనవరిలోనే రూ.500 కోట్లను చూసింది కోలీవుడ్ బాక్స్ ఆఫీసు. ఆ తర్వాత పదికి పైగా తక్కువ బడ్జెట్ చిత్రాలు రూ.50 కోట్ల మార్కును దాటాయి. గతేడాది చివర్లో రిలీజ్ అయిన జైలర్ కూడా అదరగొట్టింది. కానీ ఈ ఏడాది మాత్రం కోలీవుడ్ బాక్స్ ఆఫీసు ఒక్క 100 కోట్ల మూవీని కూడా చూడలేదు. ఆ లోటును అరణ్మనై 4 తీర్చేసింది.

సంక్రాంతికి రెండు డిజాస్టర్లు..

గత సంవత్సరం జరిగిన మ్యాజిక్ ఈ ఏడాది జనవరిలో కూడా జరుగుతుందని భావించి శివకార్తికేయన్ నటించిన అయాలన్, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలు ఈ సంవత్సరం పొంగల్‌కు విడుదలయ్యాయి. అయితే రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అప్పటి నుంచి మొదలైన బ్యాడ్ లక్ తమిళ తంబీలకు ఇప్పటిదాకా కొనసాగింది.

100 కోట్లు రాబట్టిన ఫస్ట్ మూవీ

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన అరణ్మనై 4 చిత్రానికి విశేష స్పందన లభించడంతో పాటు పలు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ 100 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. 2024లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా కూడా ఈ సినిమా నిలిచింది.

- Advertisement -

Sundar C, Raashii Khanna & Tamannaah Bhatia starrer Aranmanai 4 movie review – Firstpost

మే 3న విడుదలైన ఈ సినిమాలో సుందర్ సితో పాటు రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో యోగి బాబు, కోవై సరళ, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ మూవీ బాక్ పేరుతో రిలీజ్ అయ్యింది. అయితే టాలీవుడ్ ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.

100 కోట్ల కలెక్షన్స్…

60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా దాదాపు రెట్టింపు లాభాలను వసూలు చేయడంతో మేకర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆదరణ పొందడంతో పాటు కలెక్షన్లలో కూడా రికార్డు సృష్టిస్తోంది. 2024లో 100 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ చిత్రంగా ఘనత సాధించింది. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాత అవనీ ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కొన్ని రోజుల క్రితం తమిళంలో రూ. 56.50 కోట్లు, తెలుగులో రూ. 5.50 కోట్లు సహా దేశీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 63 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్ 16 కోట్లు. ఇప్పుడు మొత్తంగా ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన అయాలాన్ లైఫ్ టైమ్ కలెక్షన్ 76.50 కోట్లు. ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమా ఇదే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు