Sharwanandh: శర్వానంద్ కు పెళ్లి కుదిరింది.. అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అక్కినేని అఖిల్, సిద్ధార్ద్, నితిన్, శర్వానంద్ వంటి హీరోలు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. వీరు ఎప్పుడు పెళ్లి ఊసు ఎత్తినా ప్రభాస్ పెళ్లి తర్వాత అంటూ దాట వేస్తూ వస్తున్నారు. అయితే ఈ లిస్టులో ఇప్పుడు శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. అవును హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడట.

ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ షోలో శర్వానంద్ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు బాలయ్య. దీనికి ప్రభాస్ పెళ్లి చేసుకున్నాక తాను చేసుకుంటానని బదులిచ్చాడు శర్వానంద్. ఇక తాజాగా శర్వానంద్ ప్రేమించిన అమ్మాయి తోనే పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. ఇన్నాళ్లు పెళ్లి మాట ఎత్తగానే టాపిక్ డైవర్ట్ చేస్తూ వచ్చిన శర్వానంద్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి తీసుకోబోతున్నాడని తెలుస్తోంది.

అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆ అమ్మాయి ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కారణంగా హైదరాబాద్ లోనే ఉంటుందట. శర్వానంద్ తాను ప్రేమించిన అమ్మాయిని అరేంజ్డ్ మ్యారేజ్ గా సెట్ చేశాడు అనే టాక్ చక్కర్లు కొడుతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు? ఆమె పేరేంటి? పెళ్లి ఎప్పుడు అనే విషయాలను శర్వానంద్ త్వరలోనే ప్రకటిస్తాడని తెలుస్తోంది.

- Advertisement -

38 ఏళ్ల శర్వానంద్ దాదాపు పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. శర్వానంద్ కెరీర్ ఇప్పుడిప్పుడే కొంచెం గాడిలో పడింది. ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అంటున్నాడు శర్వా. ఇక ప్రస్తుతం శర్వా పీపుల్స్ మీడియా, సితార బ్యానర్లలో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు