Sharwa 37 : శర్వానంద్, రామ్ అబ్బరాజు మూవీ టైటిల్ ఫిక్స్?

Sharwa 37 : యంగ్ అండ్ ప్రామిసింగ్ టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి అందరి నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనమే సినిమాతో బిజీగా ఉన్న శర్వా ఆ తర్వాత తన 36వ సినిమా, 37వ సినిమాలను కూడా లైన్ లో పెట్టేసాడు. తాజాగా శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు బాలయ్య టైటిల్ ను మేకర్స్ వాడుకుంటున్నారని అంటున్నారు. మరి ఇంతకీ శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన టైటిల్ ఏమిటంటే…

బాలయ్య టైటిల్ తో శర్వానంద్…

సామజవరగమన ఫేమ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ 37వ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, శర్వానంద్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అనే టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బాలయ్య బ్లాక్ బస్టర్ ఓల్డ్ మూవీకి సంబంధించిన టైటిల్ ను ఈ మూవీకి ఖరారు చేశారని ప్రచారం జరుగుతుంది. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన “నారీ నారీ నడుమ మురారి” అనే టైటిల్ ను శర్వానంద్ 37వ ప్రాజెక్ట్ పేరుగా అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయగా, వారిద్దరి మధ్య ఆయన నలిగిపోయిన తీరు నవ్వించడంతో పాటు ప్రేక్షకులను ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యేలా చేసింది. తాజాగా మరోసారి శర్వానంద్ మూవీకి నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది అని వస్తున్న వార్తలు క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇక ఈ మూవీలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించబోతున్నారని సమాచారం. మరి ఈ మూవీ టైటిల్ గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అంటే మేకర్సే క్లారిటీ ఇవ్వాలి.

శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే…

చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే మూవీ చేస్తున్నాడు శర్వానంద్. ఇది ఆయన కెరీర్లో 35వ సినిమా కాగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్, వివేక్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒకవైపు ఈ మూవీ చేస్తూనే మరోవైపు తన 36వ మూవీని కూడా ఎలాంటి హడావిడి లేకుండా స్టార్ట్ చేశాడు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీకి లూజర్ వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ సరసన ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, నెక్స్ట్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ తన 37వ మూవీని లైన్లో పెట్టారు. ఈ మూవీకే నారి నారి నడుమ మురారి అనే టైటిల్ ను అనుకుంటున్నారనే క్రేజీ టాక్ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు