Sankrathi Films: ఇది నీకు ఇది నాకు

ఎన్ని పండగలున్న సంక్రాంతి పండగకు ఉన్న ప్రత్యేకత వేరు.
వరుసగా మూడు రోజులు పాటు పండగలను జరుపుకుని తరువాత రోజు కుటుంబంతో పాటు సినిమాకి వెళ్లడం ఒక ఆనవాయితీ. దీనిని గ్రహించే చాలామంది దర్శకనిర్మాతలు వాళ్ళ సినిమాలు పండగకు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు రావడం ఎంత సహజమో, థియేటర్స్ కొరత రావడం కూడా అంతే సహజం.

ఎప్పటిలానే బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి కూడా భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి.ఈసారి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలకానున్నాయి.
త‌మిళ స్టార్ హీరో అజిత్ కుమార్ న‌టించిన సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌లవుతుంటాయి. ఈ ఏడాది ‘వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్‌.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘తునివు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ కి సిద్దమవుతుంది. మొదటి ఈ చిత్రం రిలీజ్ కావడంతో ఈ చిత్రానికి ఫుల్ గా థియేటర్స్ అందుబాటులో ఉండనున్నాయి.

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వరిసు. ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరు తో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది.సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు అన్నిటికంటే ముందు అనౌన్స్ చేసింది “వరిసు” చిత్రమే. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రటించించిన విషయం తెలిసిందే. విజయ్ వారసుడు చిత్రంతో పాటు, నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కూడా జనవరి 12న రిలీజ్ కానుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వారసుడు సినిమాకి కొన్ని థియేటర్స్ ను, అలానే వీర సింహారెడ్డి సినిమాకు కొన్ని థియేటర్స్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక చివరగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “వాల్తేరు వీరయ్య” ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా ఏళ్ళు తరవాత మెగాస్టార్ మాస్ లుక్ లో కనిపించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అన్నిటికంటే చివరగా ఈ చిత్రం రిలీజ్ కానుండటం వలన వారసుడు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు తలావంతు థియేటర్స్ ను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇంద్ర సినిమాలో “ఇది నీకు ఇది నాకు” అనే డైలాగ్ లా థియేటర్స్ బాగానే సర్దుకున్నారు మన దర్శకనిర్మాతలు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు