Samantha: ఆమె కోసం మూవీ నుంచి తప్పుకున్న సమంత..!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా సమంత నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. యశోద సినిమా దగ్గర నుంచి ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. సమంత తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇదంతా ఇలా ఉండగా సమంత ఎన్నో సినిమాలకు కమిట్ అయిందని. కానీ మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో అవన్నీ ఆగిపోయాయని తెలుస్తోంది.

అలా సమంత అప్పటికే సైన్ చేసిన ఓ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో ఆ మూవీ టీం మరో హీరోయిన్‌ను ఎంపిక చేశారు. సమంత గడిచిన కొన్ని నెలల క్రితం ఇండో-బ్రిటీస్ ప్రాజెక్టు కోసం ఫిలిప్ జాన్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే మయో సైటీస్ కారణంగా సినిమాలకు సామ్ బ్రేక్ తీసుకోవడంతో, ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో సమంత ప్లేసులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ శృతిహాసన్ ను తీసుకున్నట్లుగా ఒక న్యూస్ వైరల్ గా మారింది. అందుకు సంబంధించి శృతిహాసన్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని ఆమె తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ ను కూడా షేర్ చేసింది.

Samantha: Samantha left the movie for her..!

- Advertisement -

ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో వివేక్ కల్రా తో పాటు శృతిహాసన్ కూడా నటించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఇందులో శృతిహాసన్ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతోందట. ఇందులోని పాత్ర ఇంగ్లీష్, తమిళ వెర్షన్ లను కలిగి ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని సునీత తాటి నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవలే శృతిహాసన్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ అందుకుంది.

తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్గా మారింది. శృతిహాసన్ కూడా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడంతో సమంత ప్లేసులో శృతిహాసన్ చేరిందనే వార్తలకు క్లారిటీ వచ్చింది. ఏది ఏమైనా సమంత స్థానాన్ని శృతిహాసన్ కొట్టేయడంతో సమంత అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేయగా.. శృతిహాసన్ అభిమానులు ఆనంద పడుతున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు