Samantha: ఇటు ఫుల్ యాక్షన్… అటు ఫుల్ రొమాంటిక్

ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమంత, నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లడానికి కాస్త గట్టిగానే కష్టపడతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని, తన కెరీర్ ను బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో స్ట్రాంగ్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. రాజ్ అండ్ డీకే దర్శకద్వయం తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ బాలీవుడ్ వర్సెన్ లో సామ్ కీలక పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్‌తో రాబోతుంది.

ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం, సామ్ ఉండటం వల్ల ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీని కోసం సామ్ కూడా చాలా కష్టపడతుంది. రోజులో ఎక్కువ సమయం జిమ్ లోనే గడిపేస్తుంది. ఈ మధ్య కాలంలో సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో జిమ్ ఫోటోలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

తాజాగా తన జిమ్ ట్రైనర్‌తో కసరత్తులు చేస్తున్న వీడియోలను అభిమానులతో పంచుకుంది సామ్. ఈ వీడియోను చూసి, సిటాడెల్ కోసం సామ్ చేస్తున్న కష్టానికి అభిమానులు ఫిదా అయిపోతన్నారు. అలాగే ఈ సిరీస్ లో సామ్‌తో యాక్షన్ సీన్స్‌ను దర్శకద్వయం రాజ్ అండ్ డీకే భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇటీవల యశోద సమయంలో సమంత చేసిన యాక్షన్ సీన్స్‌కు వచ్చిన ప్రశంసలు ఇంక మర్చిపోలేం.

- Advertisement -

ఇది ఇలా ఉండగా, టాలీవుడ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి అనే మూవీ చేస్తుంది. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ జానర్‌లో రాబోతుంది. ఇటీవల ఖుషి నుంచి వచ్చిన “నా రోజా నువ్వే…” సాంగ్‌ను చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. అలాగే అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

ఇలా సామ్ ఒకే సమయంలో ఇటు ఫుల్ యాక్షన్ సీన్స్ చేస్తుంది. అలాగే అటు రొమాంటిక్ సీన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు