Salaar News: హాలీవుడ్ రేంజ్ ప్లాన్… ప్రశాంత్ నీల్ అంటే మామూలుగా ఉండదు మరి

Salaar News

ప్రశాంత్ నీల్ అంటే ఓ సంచలనం అని ఒక మాటలో చెప్పలేం. రెండో సినిమాకే సినీ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్న ప్రశాంత్ నీల్… మూడో సినిమాకు తన గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఇక నాలుగో సినిమా గురించి అయితే చెప్పడం అవసరం లేదు. ప్రశాంత్ నీల్ కెరీర్ లో నాలుగో సినిమాగా వస్తున్న సలార్… పై ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సార్లు వాయిదా వేస్తే అంత బజ్ పెరుగుతుందే కానీ, ఫ్యాన్స్‌లో అసహనం మాత్రం రావడం లేదు.

అన్ని అనుకున్నట్టు జరిగితే, ఇప్పటికే థియేటర్స్ లో సలార్ సునామి ఉండేది. కానీ, డిసెంబర్ 22కు సలార్ సినిమా వాయిదా వేయడంతో బాక్సాఫీస్ వద్ద వచ్చే సునామి కాస్త వాయిదా పడింది అంతే. సలార్ వాయిదా పడితే, అవుట్ పుట్ మరింత మెరుగ్గా వస్తుంది అనే ఆలోచిస్తున్నారే కానీ, దర్శక నిర్మాతలను తిట్టిపోస్తలేరు ఫ్యాన్స్. ఎందుకంటే, ప్రశాంత్ నీల్ పై వాళ్లకు అంత నమ్మకం.

అయితే కొంత మంది మాత్రం నిరాశ పడ్డారు. అయితే ఈ నిరాశకు పెద్ద ఫలితమే ఉండబోతుంది. వాయిదా అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత సలార్ ఓ చిన్న షెడ్యూల్‌తో షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో ప్రశాంత్ నీల్ పెద్ద ప్లానే వేశాడట.

- Advertisement -

ఏకంగా రాకింగ్ స్టార్ యష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే దింపాడని తెలుస్తుంది. వీరిపై చిన్న షూట్ చేశారట. అంటే… సలార్ లో యష్, తారక్ ల ఎంట్రీ ఉండబోతుందని బెంగళూర్ లో టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. కాగా, హాలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్‌లలో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ క్యామియో ఎంట్రీలను పెడుతుంటారు. ఇప్పుడు సలార్ విషయంలో కూడా ప్రశాంత్ నీల్ ఈ హాలీవుడ్  స్టాండర్స్ ని ఫాలో అవుతున్నాడు.

సలార్ క్లైమాక్స్ లో ఈ స్టార్స్ కనిపిస్తారట. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్‌కి మరింత హైప్ వచ్చింది.

ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్ట్‌లు యష్ తో కేజీఎఫ్ 3, తారక్ తో NTR31 ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలకు సలార్ కి సంబంధం ఉంటుందని ఇప్పటి వరకు వచ్చిన వార్తలు కూడా నిజమే అని అర్థమవుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు