Lal Salaam: మరోసారి ‘పొంగల్’ బరిలో రజిని..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేని తలైవా ఈ ఇయర్ లో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఆయన హీరోగా నటించిన జైలర్ అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చాలా ఏళ్ళ తర్వాత రజినీకాంత్ తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడని చెప్పొచ్చు. ఇక జైలర్ తర్వాత తన తర్వాతి సినిమాల లైనప్ ని కూడా సెట్ చేసుకున్నాడు.

అయితే వాటిలో ముందుగా రాబోయే సినిమా ‘లాల్ సలాం’. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్ గా ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా, లీడ్ క్యారెక్టర్లలో విష్ణు విశాల్, నిరోష, జీవిత రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇంతకు ముందే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా సినిమాపై ఆసక్తి ని పెంచేసాయి.

ఇక లాల్ సలాం రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. 2024 పొంగల్ (సంక్రాంతి) కి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే డేట్ గురించి మాత్రం చెప్పలేదు. ఇక రజినీకాంత్ చివరగా పేట(2019), దర్బార్(2020) సినిమాలతో వరుసగా సంక్రాంతికి రాగా, ఇప్పుడు మరోసారి పొంగల్ సీజన్ పై ఖర్చీఫ్ వేయడం జరిగింది.

- Advertisement -

ఇక తమిళ్ నుండి అఫిషియల్ గా లాల్ సలాం, శివ కార్తికేయన్ అయలాన్ ఫిక్స్ కాగా, తెలుగులో మాత్రం అరడజను దాకా లైన్లో ఉన్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ కల్కి, నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగిల్, హనుమాన్ ఇంకా రెండు చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే సంక్రాంతి వచ్చే వరకు ఇందులో చాలా చిత్రాలు పోటీ నుండి తప్పుకునే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు