Sai Dharam Tej Warning: నిహారిక పోస్ట్ – సాయి ధరమ్ తేజ్ వార్నింగ్

Sai Dharam Tej Warning

కారణమేంటో తెలియదు కానీ నిహారిక కొణిదెల అంటే చాలా మందికి నచ్చదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యువతకు.. నిహారిక కొణిదెల ఏ పోస్ట్ పెట్టిన, ఏది షేర్ చేసిన, ఆ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో ఆమెని పలు రకాలుగా తిట్టిపోస్తూనే ఉంటారు. అయితే ఆమె పెళ్లి తరువాత మాత్రం ఈ తిట్ల పురాణం కాస్త తగ్గిందని చెప్పాలి. ఇక అంత బాగానే ఉందనుకునే టైం లోనే ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడంతో నిహారిక మరోసారి సోషల్ మీడియా చేతికి మళ్ళీ చిక్కినట్టయింది.

మెగా డాటర్ అంటూ నిహారిక కొణిదెల ను మెగా ఫ్యాన్స్ అంత నెత్తిన పెట్టుకుంటే ఆమె మాత్రం కేవలం సినిమాలలో హీరోయిన్ గా నటించడం కోసం పెళ్ళైన మూడేళ్ళలోనే భర్తతో విడాకులు తీసుకోవడం మెగా ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక ఆ తరువాత కొద్దిరోజులకు ఈ విషయం అందరు మర్చిపోయినా.. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె ఏ పోస్ట్ పెట్టిన అభిమానులు మాత్రం తమ ఫ్రాస్టేషన్ ను చూపిస్తూనే ఉన్నారు. ఇక లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ ఇటీవలనే నటించిన ఒక షార్ట్ ఫిలిం సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటను నిహారిక కొణిదెల తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ఈ పాట కోసం తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నా అని రాసుకొచ్చింది.

ఇక దానికి సమాధానంగా ఒక నెటిజన్ రియాక్ట్ అయ్యాడు” వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపోయే” అంటూ కామెంట్ చేసాడు. అయితే ఇటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో రావడం సర్వ సాధారణమైన ఈ కామెంట్ చూసిన సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆ నెటిజన్ కు గట్టిగ వార్నింగ్ ఇచ్చాడు ” నోరు అదుపులో పెట్టుకో.. కామెంట్ డిలీట్ చెయ్ ” అంటూ ఆ సాయి ధరమ్ తేజ్ ఆ వ్యక్తికి రిప్లై ఇవ్వడంతో ఆ నెటిజన్ ఆ కామెంట్ డిలీట్ చేసాడు. దాంతో ఆ కామెంట్ కన్వర్జేషన్ మొత్తం డిలీట్ అయిపొయింది. అయితే మరీ గతకొద్ది రోజులుగా నిహారిక, సాయి ధరమ్ తేజ్ ను రెండవ పెళ్లి చేసుకోబోతుందటూ వార్తలు వస్తుండటంతో సాయి ధరమ్ తేజ్ ఇలా బిహేవ్ చేయడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు