S.S.Rajamouli: 200డేస్ నాట్ ఔట్.. అలా ఆడేస్తుందంతే

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రం తన రికార్డుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. విడుదలై ఏడాది దాటిపోయినా కూడా ఈ చిత్రం పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటుంది. గత సంవత్సరం మార్చి 25న విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 1250 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క తెలుగు లోనే 650 కోట్లకి పైగా వసూలు చేసి ఇక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది ఈ సినిమా.

ఇక RRR మూవీ అటు అవార్డుల వేటలోను అంతే వేగంగా దూసుకుపోయింది ఈ సినిమా. ఆ మధ్య గోల్డెన్ గ్లొబ్ అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకోగా, రీసెంట్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకుంది. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో కీరవాణి, చంద్రబోస్ లకు అవార్డులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

అయితే రీసెంట్ గా RRR మరో రికార్డుని సృష్టించింది. అది కూడా పరాయి గడ్డపైన క్రియేట్ చేయడం విశేషం. RRR సినిమా జపాన్ లో 2022 చివర్లో విడుదలై అక్కడ కూడా బాగా ఆడుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ మధ్యే జపాన్ లో 100 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు ఇప్పుడు RRR మూవీ జపాన్ లో ఏకంగా 102 స్క్రీన్స్ లో నాన్ స్టాప్ గా 200రోజులాడి రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలో ఇప్పుడు 50రోజులు, 100 రోజులు ఆడే రోజులు పోయాయి. ఇక్కడ ఇప్పుడు కలెక్షన్లే కొలమానంగా చూస్తున్నారు. కానీ RRR మాత్రం అక్కడ రెండు వందల రోజులాడటం అద్భుతమైన రికార్డనే చెప్పాలి. ఇప్పటికి కూడా జపాన్ లో సక్సెఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పటివరకు “1.97 బిలియన్ యెన్”(119 కోట్ల) గ్రాస్  కలెక్షన్స్ వసూలు చేసి, త్వరలో 2 బిలియన్ యెన్ వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు