RC 15 : కోలీవుడ్ స్టార్ కన్ఫామ్

భారతదేశ అగ్రదర్శకుల్లో  శంకర్  ఒకరు. ముఖ్యంగా భారతీయుడు, అపరిచితుడు, రోబో వంటి సినిమాలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. హీరోలతో సంబంధం లేకుండా శంకర్ పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. 

శంకర్ తన సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ మేసేజ్ కూడా ఇస్తుంటాడు. ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ తో ‘RC15’ సినిమా చేస్తున్నాడు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఈ తరుణంలో శంకర్ RC 15 పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు. టెక్నిషియన్స్, యాక్టర్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా పేరున్న వాళ్లని తీసుకుంటున్నాడు. ఈ చిత్రం మరో స్టార్ యాక్టర్ ని ఎంపిక చేశాడు. అతను మరెవ్వరో కాదండోయ్.. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జే. సూర్య ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. 

ముఖ్యంగా షూట్ వేసుకొని చేతిలో ఫైల్ పట్టుకొని స్టైలిష్ గా నడుస్తున్నట్టు పోస్టర్ ని విడుదల చేశారు. ఎస్. జే సూర్య ఈ చిత్రం భాగం అవ్వడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. చరణ్ రెండు వేర్వేరు గెటప్ లలో కనిపించనున్నాడు. వీలైనంత త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాని విడుదల చేయాలని మేకర్ ప్లాన్  చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ లు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు