Yashoda : కొత్తగా.. ఆసక్తిగా..

టాలీవుడ్ హీరో నాగ చైతన్య తో సమంత విడాకులు తీసుకున్న అనంతరం వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నది. ఒకదాని తర్వాత ఒక పాన్ ఇండియాలు సినిమా చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్, కాత్తు వాక్కుల రెండు కాదల్ తర్వాత యశోద సినిమాలో సమంత నటిస్తోంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

హరి-హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతకంపై ప్రొడక్షన్ నం.14 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లో సమంత గర్భవతి పాత్రలో కనిపించనుంది. టీజర్ లో సమంతాను గర్భవతిగా ఉన్నప్పుడు ఏ ఏ పనులైతే చేయొద్దని డాక్టర్ చెప్తుందో.. సమంత అలాంటి పనులే చేస్తుంది. ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం, వాళ్ళ నుంచి సామ్ తప్పించుకోవడం, విలన్ తో పోరాడటం ఈ టీజర్ లో చూపించారు. అసలు సమంతాకు ఏమైంది? ఆమెను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు? అనేది ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ అప్డేట్ తో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు