Ravi Teja : ధమాకా నుంచి మాస్ సాంగ్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కమర్షియల్ సినిమాలకి పెట్టింది పేరు. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి సహనిర్మాత వివేక్ కూచిబోట్లా. ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చంది. కాగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగిపోతున్నాయి.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్ లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘దండకడియాల్’ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మాస్ బీట్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. రవితేజ ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను బీమ్స్ తో పాటు సాహితి, మంగ్లీ ఆలపించారు. అంతేకాకుండా ఈ పాటకు బీమ్స్ స్వయంగా సాహిత్యం అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజ్ అయిన పాటలన్నీ చాట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ లోకి రావాలని రవితేజ కసితో ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు