Eagle : భారీ స్థాయిలో “ఈగల్” ప్రీ రిలీజ్ బిజినెస్… బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Eagle

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఈగల్”. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నవదీప్ కీలక పాత్రను పోషిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఆపై వాయిదా పడి, ఎట్టకేలకు ఫిబ్రవరి 9న రిలీజ్ కు రెడీ అయ్యింది. మరి “ఈగల్” మూవీ హిట్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు? అనే వివరాల్లోకి వెళితే…

“ఈగల్” మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే రవితేజ కెరీర్లో హైయ్యెస్ట్ బిజినెస్ జరిగిన టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలవడం విశేషం. రవితేజ హీరోగా నటించిన గత చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాఫ్ గా నిలిచినప్పటికీ, ఆయన నెక్స్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టడం గమనార్హం. వరల్డ్ వైడ్ గా “ఈగల్” థియేట్రికల్ రైట్స్ 21 కోట్లకు అమ్ముడు అయినట్టు తెలుస్తోంది. ఆంధ్రా ఏరియాలో మొత్తం కలిపి 8.5 కోట్లు, నైజాంలో 6 కోట్లు, సీడెడ్ లో 2.5 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇక ఏపీ తెలంగాణలో కలిపి 17 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్లు, తమిళనాడు కర్ణాటక తో పాటు ఇతర రాష్ట్రాల్లో మరో 2 కోట్ల వరకు రైట్స్ అమ్ముడైనట్టు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల వరకు “ఈగల్” ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ హిట్ కావాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద 22 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాల్సిందే. “ఈగల్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు అన్నమాట.

టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. అట్టర్ ప్లాప్ గా నిలిచిన ఈ మూవీ రైట్స్ 37 కోట్లకు అమ్ముడయ్యాయి. టైగర్ నాగేశ్వరరావుతో పోల్చుకుంటే “ఈగల్” 16 కోట్లు తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం గమనార్హం. అంతకంటే ముందు రవితేజ హీరోగా నటించిన రావణాసుర, కిలాడి సినిమాలు 22 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. అయితే ఈ సినిమాలన్నీ డిజాస్టర్ గానే నిలిచాయి. ఇప్పుడు “ఈగల్” మూవీతో రవితేజ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో రవితేజ రైతు సమస్యలపై పోరాడే షూటర్ పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. మరి రవితేజ ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడా? అంటే ఫిబ్రవరి 9 వరకు వెయిట్ అండ్ సి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News,current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు