Raashi Khanna: ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..

టాలీవుడ్ బ్యూటీ రాశిఖన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అక్కడి నుండి అనేక సక్సెస్ ఫుల్ సినిమాలలో నటించి అభిమానులను అలరించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది ఈ భామ. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. అయితే ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది.

తాజాగా “ఫర్జి” అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో ఆర్బిఐ ఆఫీసర్ మెఘా వ్యాస్ గా నటించి మెప్పించింది రాశి ఖన్నా. ఇందులో రాశిఖన్నా, షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్, భువన్ ఆరోరా వంటి వారు కీలక పాత్రలు చేశారు. ఈ షో కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీడియో చాటింగ్ లో రాసి ఖన్నా మాట్లాడుతూ.. ఫర్జీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఈ సందర్భంగా ఓ అభిమాని.. ” మీరు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు చేస్తారు” అంటూ అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ.. తాను సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతో పెద్ద అభిమానినని, ఈ విషయాన్ని తాను ఎన్నో సందర్భాలలో తెలిపానని చెప్పుకొచ్చింది. ఈ మధ్య మహేష్ – నమ్రత లను కలిశానని, ఆ సందర్భాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పింది. ఇక మహేష్ బాబు తో సినిమా చేసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, దేవుడి దయవల్ల త్వరలోనే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని తెలిపింది. తామిద్దరి పెయిర్ కూడా బాగుంటుందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు