Ram Charan: డిసెంబర్ లో కొత్త సినిమా

ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ అలాంటి పాన్ ఇండియా స్థాయి సినిమాలే చేస్తున్నారు. ఈ మెగా పవర్ స్టార్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో #RC15 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 70 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తుంది. అయితే శంకర్ భారతీయుడు 2 సినిమా పనుల్లో బిజీ గా ఉండటంతో #RC15 షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడున్న ఖాళీ సమయంలో మరో సినిమాపై ఫోకస్ పెట్టాడు రామ్ చరణ్.

చరణ్ తర్వాత సినిమా జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై మరో అప్డేట్ తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ విన్న రామ్ చరణ్ ఫైనల్ కూడా చేశారు. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా యువ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ను ఎంపిక చేశారు. అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ చెప్పారని సమాచారం అందుతుంది.

దీంతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం కాస్ట్ అండ్ క్రూను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కాగా గౌతమ్ తిన్ననూరి మళ్లీ రావా తర్వాత తెరకెక్కించిన జెర్సీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇదే జెర్సీని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. కానీ అది నిరాశపరిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు