Rahul – Athiyashetty: ఒక్కటైన జంట

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, సునీల్ శెట్టి కుమార్తె, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహ బంధంతో ఒకటయ్యారు. ఖండాలలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు ఇలా మూడు వేల మంది మధ్య వీరి వివాహం మహా సంబురంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకలో “నో ఫోన్ పాలసీ” అమలు చేసినట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా సునీల్ శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ – అతియా శెట్టి వివాహానికి బంధువులు, స్నేహితులు, పలువురు ప్రముఖులు, ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెంట్స్ యాజమాని సంజీవ్, గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్, పలువురు బాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహానికి హాజరయ్యారు. ఈ జంట పెళ్లి ఫోటోలను తమ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

దీంతో బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ముంబై వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ చేయనున్నారు. దాదాపు 3,000 మంది అతిథులతో ఈ రిసెప్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు భార్యాభర్తలు గా మారిన తర్వాత తొలి ఫోటోను రాహుల్ – అతియాశెట్టి తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది అతియా. “నేను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా. ఈరోజు మాకు అత్యంత విలువైన రోజు. వైవాహిక బంధం లోకి అడుగుపెట్టడం అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ శుభ సందర్భంలో అందరి దీవెనలు కోరుకుంటున్నా” అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు, క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు