Puri Jagannadh : విజయ్ లో నాకు నచ్చింది అదే

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం “లైగర్”. ఈ చిత్రంలో రౌడీ హీరోతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే రొమాన్స్ చేయనుంది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచింది చిత్ర బృందం. తాజాగా ఆదివారం వరంగల్ జిల్లా మడికొండలోని సత్య సాయి కన్వెన్షన్ లో “లైగర్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, చార్మి, ప్రముఖ నటుడు ఆలీతోపాటు పలువురు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండపై పూరి జగన్నాథ్ పొగడ్తల వర్షం కురిపించారు. పూరి జగన్నాథ్ మొదటిసారి అర్జున్ రెడ్డి సినిమా చూసిన వెంటనే విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. కష్టాలలో విజయ్ చాలా తోడుగా ఉన్నాడని, తాము అప్పుల్లో ఉన్నామని తెలిసి “లైగర్” సినిమా కోసం ఇచ్చిన 2 కోట్లను తిరిగి ఇచ్చేసి అప్పులు తీర్చమన్నాడని చెప్పారు. అలాంటి హీరోలను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పుకొచ్చాడు. అలాగే అన్నింటిలో సపోర్ట్ గా ఉన్నాడంటూ చెప్పాడు. విజయ్ దేవరకొండలో తనకు నిజాయితీ బాగా నచ్చిందని, అది మాటల్లోనే కాకుండా యాక్టింగ్ లోను ఉంటుందని పూరి అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు