Adipurush : టార్గెట్.. పాన్ వరల్డ్

పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ప్రభాస్. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో దేశం మొత్తం సంచలనం సృష్టించాడు డార్లింగ్. అప్పటి నుండే ప్రభాస్ ను యంగ్ రెబల్ స్టార్ అని కాకుండా, పాన్ ఇండియా స్టార్ అని పిలుస్తున్నారు. ప్రభాస్ తర్వాత ఈ ట్యాగ్ కోసం స్టార్ హీరోలు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రభాస్ మరో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సారి టార్గెట్ పాన్ ఇండియా కాదు. పాన్ వరల్డ్.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ తో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

అయితే, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే కాదు, హాలీవుడ్ లోనూ విడుదల చేసి పాన్ వరల్డ్ సినిమాగా చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను కొంతమంది కొట్టిపారేశారు. మరికొందరు, ప్రభాస్ సినిమా పాన్ వరల్డ్ వైడ్ విడుదల అయితే సూపర్ హిట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. కానీ, ఆదిపురుష్ సినిమా హాలీవుడ్ లో విడుదల అవుతుందా, లేదా అనే క్లారిటీ మాత్రం రాలేదు.

- Advertisement -

ఎట్టకేలకు డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆదిపురుష్ సినిమా హాలీవుడ్ లో రిలీజ్ చేయడంపై, ఓ ఇంటర్యూలో రెబల్ స్టార్ కృష్ణం రాజు రివీల్ చేశారు. ప్రభాస్ ను ఆదిపురుష్ తో హాలీవుడ్ కు పరిచయం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సినిమా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతుంది ప్రకటించి, ఇప్పటి వరకు వచ్చిన వార్తలను నిజం చేశారు.
ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను నచ్చితే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ వరల్డ్ స్టార్ కావడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు