Toby: కన్నడ విలక్షణ నటుడి మరో వైవిధ్యమైన చిత్రం అనౌన్స్ మెంట్

రాజ్ బి శెట్టి.. ఈ నటుడి గురించి తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ చార్లీ సినిమాలో వెటర్నరీ డాక్టర్ అంటే ఇట్టే గుర్తుపడతారు. కర్ణాటకకు చెందిన ఇతడు కన్నడ సినిమాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా నటుడిగా నటిస్తూ, దర్శకుడిగాను సినిమాలు చేసాడు. అయితే 2021 లో రాజ్ బి శెట్టి దర్శకత్వం వహించిన “గరుడ గమన వృషభ వాహన” సినిమాతో ఇండియా మొత్తం ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాను రాజ్ బి శెట్టి దర్శకత్వం వహించడమే గాకుండా అందులో ప్రధాన పాత్రను పోషించాడు. తన స్నేహితుడైన రిషబ్ శెట్టి (కాంతారా ఫేమ్) తో కలిసి ఆ సినిమాలో నటించాడు.

సినిమాలో తన నట విశ్వరూపం చూపించిన రాజ్ బి శెట్టి విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఓటిటీ లో విడుదలైన “గరుడ గమన వృషభ వాహన” చిత్రాన్ని భాష రాకపోయినా సబ్ టైటిల్స్ వేసుకుని మరీ ఆడియన్స్ విపరీతంగా చూసారు. ఆ తరువాత రాజ్ బి శెట్టి మళ్ళీ సినిమాలో హీరోగా నటించలేదు. చార్లీ లో నటించినా అందులో అతను హీరోకాదు.

అయితే చాలా రోజుల తరువాత జూన్ 13న రాజ్ బి శెట్టి కొత్త సినిమా యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగింది. “టోబి” అనే పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమాకు రాజ్ బి శెట్టియే కథ అందించగా, బసిల్ చలక్కల్ అనే వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు. రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ లో ఒక పొట్టేలు ఉగ్రరూపంలో ఉండగా, దానికి ఒక ముక్కు పుడక కూడా ఉంది. బహుశా ఈ పోస్టర్ ద్వారా హీరో పాత్ర స్వభావాన్ని చెప్పి ఉండవచ్చు. ఇక ఈ సినిమాను ఆగష్టు 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు