ENE: రీ- రిలీజ్ కి రెడీ అయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ – వివరాలు ఇదిగో

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ- రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం అందరికి తెల్సిందే. గతంలో స్టార్ హీరోల పుట్టిన రోజులకి మాత్రమే ఈ విధంగా వాళ్ళ సినిమాలు రీ- రిలీజ్ అవుతూండేవి, అయితే ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు సినిమాలే కాకుండా, సినిమా బాగుండి.. ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారనిపిస్తే చాలు వెంటనే ఆ సినిమాలని రీ- రిలీజ్ చేసేస్తున్నారు మేకర్స్.

మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాతో ఊపందుకుంది. ఇక అప్పటినుంచి వారానికొకటి, నెలకొకటి చెప్పున పలు సూపర్ హిట్ సినిమాలు రీ- రిలీజ్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో మరో సూపర్ హిట్ సినిమా కూడాచేరింది.

ఆ సినిమా ఏంటంటే యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “ఈ నగరానికి ఏమైంది”. పెళ్లి చూపులు సినిమా తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. విశ్వక్ సేన్ , సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇప్పటికి కూడా సినిమాకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.

- Advertisement -

అయితే ఈ రీ- రిలీజ్ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి ఈ నగరానికి ఏమైంది సినిమాని కూడా రీ- రిలీజ్ చేయాలనీ యూత్ నుంచి సోషల్ మీడియా ద్వారా డిమాండ్ రావడంతో ఈ నెల 29న సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ సినిమా మొదటి రిలీజ్ డేట్ కూడా అదే రోజున అవడంతో ఈ రిలీజ్ డేట్ నే ఫైనల్ చేసారు

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు